Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం

ABN , Publish Date - Jan 15 , 2024 | 10:01 PM

పండగైనా, సోషల్ మీడియాలో చేసే పోస్ట్ అయినా.. నా చర్యలు ఊహాతీతంగా ఉంటాయని మరోసారి నిరూపించింది యాంకర్ కమ్ నటి అనసూయ. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి ఫైర్ బ్రాండ్‌లా మారే అనసూయ.. తనని అభిమానించే వారికి మాత్రం అందాల రాణి. ఎందుకంటే, ఎప్పుడూ లేటెస్ట్‌గా ఫొటోస్ వదులుతూ.. సోషల్ మీడియాని హీటెక్కిస్తుంటుంది. సంక్రాంతి స్పెషల్‌గా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Anasuya: సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో.. అనసూయ చర్యలు ఊహాతీతం
Anasuya

పండగైనా, సోషల్ మీడియాలో చేసే పోస్ట్ అయినా.. నా చర్యలు ఊహాతీతంగా ఉంటాయని మరోసారి నిరూపించింది యాంకర్ కమ్ నటి అనసూయ (Anasuya). సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి ఫైర్ బ్రాండ్‌లా మారే అనసూయ.. తనని అభిమానించే వారికి మాత్రం అందాల రాణి. ఎందుకంటే, ఎప్పుడూ సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా ఫొటోస్ వదులుతూ.. సోషల్ మీడియాని హీటెక్కిస్తుంటుంది. ‘ఎవరు, ఏమైనా అనుకోండి.. డోంట్ కేర్. నాకు వచ్చినట్లు బతుకుతా. ఇది నా జీవితం. స్వేచ్ఛ నా హక్కు..’ అనేలా నెగిటివ్ నెటిజన్లకు క్లాస్ ఇచ్చే అనసూయ.. ఎటువంటి ఫొటో పోస్ట్ చేయడానికైనా అస్సలు భయపడదు. (Anasuya Pongal Celebrations)

Anasuya-1.jpg

కొందరు ఇలాంటి ఫొటో షేర్ చేస్తే బాగోదేమో అని భయపడతారు.. కానీ అనసూయ మాత్రం వేరే లెవల్ అంతే. తాజాగా ఆమె తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూడు భాషలలో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో మరోసారి ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. కారణం, ఈ ఫొటోలలో తను అలా ఉంది మరి. అందుకే అంది.. అనసూయ చర్యలు ఊహాతీతం అని. (Anasuya Pongal Wishes)


Anasuya-2.jpg

పండగ అంటే అందరూ నిండుగా చీరకట్టుకుని ఏవేవో వండుతున్నట్లుగా స్టిల్స్ ఇస్తుంటారు. కానీ అనసూయ చీరలోనే ఆరుబయట వేసిన ముగ్గు దగ్గర, భర్తతో, భర్త మరియు పిల్లలతో పాటు సోలోగానూ ఓ కిక్కిచ్చే ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె ‘పండగ చేసుకోండి అనేలా’ కన్నుకొడుతున్న తీరు చూస్తే మాత్రం.. అనసూయకు నెటిజన్లు కూడా ఓ ఫ్యామిలీ అయిపోయారనేది అర్థమవుతోంది. వాళ్లని కూడా పండగ పూట ఖుషి చేయాలి కదా.. అన్నట్లుగా ఈ స్టిల్‌కు కామెంట్స్ పడుతున్నాయి. దీంతో సంక్రాంతి రోజు.. టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా అనసూయ పేరు కాసేపు ట్రెండ్ అయింది. నెటిజన్లు, అభిమానులు ఆమెకు కూడా కామెంట్లలో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*K Raghavendra Rao: ‘హనుమాన్’, ‘నా సామిరంగ’ సక్సెస్‌లపై దర్శకేంద్రుడి స్పందన ఇదే..

****************************

*Netflix: ‘దేవర’, ‘పుష్ప2’.. 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే 12 సినిమాల లిస్ట్ విడుదల

****************************

*Mega156: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబో చిత్ర టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అద్భుతం

************************

*Vijay Binni: ‘నా సామిరంగ’ రిజల్ట్‌పై దర్శకుడి రియాక్షన్ ఇదే..

***************************

Updated Date - Jan 15 , 2024 | 10:01 PM