Kayal Anandhi: ఆనంది ‘వైట్‌ రోజ్‌’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:25 PM

‘కయల్‌’ ఆనంది ప్రధాన పాత్రను పోషించిన ‘వైట్‌ రోజ్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి విడుదల చేశారు. పూంపారై మురుగన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ రాజశేఖర్‌ దర్శకత్వంలో ఈ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆర్‌కే సురేష్‌ విభిన్నమైన గెటప్‌తో ప్రతినాయకుడిగా నటించారు. వీరితో పాటు విజిత్‌, రూసో శ్రీధరన్‌, శశిలయ, గణేష్‌, రామనాథన్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.

Kayal Anandhi: ఆనంది ‘వైట్‌ రోజ్‌’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..
White Rose Movie Stills

‘కయల్‌’ ఆనంది (Kayal Anandhi) ప్రధాన పాత్రను పోషించిన ‘వైట్‌ రోజ్‌’ (White Rose) సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) విడుదల చేశారు. పూంపారై మురుగన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్‌ రాజశేఖర్‌ దర్శకత్వంలో ఈ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆర్‌కే సురేష్‌ విభిన్నమైన గెటప్‌తో ప్రతినాయకుడిగా నటించారు. వీరితో పాటు విజిత్‌, రూసో శ్రీధరన్‌, శశిలయ, గణేష్‌, రామనాథన్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విజయ్‌ సేతుపతి రిలీజ్‌ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు.

ఈ సినిమాలో పోలీస్‌ కంట్రోల్‌ రూం కీలకంగా ఉంది. ఇందుకోసం భారీ ఖర్చుతో సెట్‌ను నిర్మించి, అందులో సినిమా షూటింగ్‌ పూర్తి చేశారు. వైరముత్తు సాహిత్యానికి సుదర్శన్‌ సంగీత బాణీలు సమకూర్చారు. ఇళయరాజా ఛాయాగ్రహణం అందించారు. త్వరలోనే ఆడియో, ట్రైలర్‌, రిలీజ్‌ తేదీలను వెల్లడించనున్నట్టు దర్శకుడు రాజశేఖర్‌ తెలిపారు. ఈ సినిమా తన లైఫ్‌లో ఓ వినూత్నమైన సినిమాగా నిలిచిపోతుందని ‘కయల్’ ఆనంది తెలిపింది. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరో విజయ్ సేతుపతికి యూనిట్ అంతా ధన్యవాదాలు తెలిపారు. (White Rose First Look Out)


Kayal-Anandhi.jpg

‘కయల్’ ఆనంది విషయానికి వస్తే.. వరుస తమిళ చిత్రాలతో ఈ భామ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. టాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు మెరుస్తూ ఉంది. ‘వైట్‌ రోజ్‌’తో పాటు ‘కయల్’ ఆనంది ప్రధాన పాత్రను పోషించిన మరో తమిళ చిత్రం ‘మంగై’ (Mangai) కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కూడా తన సినీ ఇమేజ్‌ను మారుస్తుందని ఆమె గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఏఎస్ఎం పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మాత ఏఆర్‌ జాఫర్‌ సాధిక్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కుబేరన్‌ కామాక్షి దర్శకత్వం వహించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Harish Shankar: దమ్ముంటే హరీష్ శంకర్ తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్..

***************************

*Ooru Peru Bhairavakona: మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

***************************

*Harish Shankar: ‘ఈగల్’లో లవ్ స్టోరీ లేదు.. ‘ఆర్ఆర్ఆర్’లో రొమాన్స్ లేదు

*************************

Updated Date - Feb 13 , 2024 | 03:25 PM