Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:48 PM

తన మాజీ భర్త, దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి పని చేయడానికి తనకు ఎలాంటి సమస్యా లేదని హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌ స్పష్టం చేశారు. 2006లో ధనుష్‌ హీరోగా.. సోనియా అగర్వాల్‌, స్నేహ హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘పుదుపేట’. సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఇపుడు ఈ మూవీ రెండో భాగాన్ని తెరకెక్కించాలని ధనుష్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..
Sonia Agarwal

తన మాజీ భర్త, దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి పని చేయడానికి తనకు ఎలాంటి సమస్యా లేదని హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌ స్పష్టం చేశారు. 2006లో ధనుష్‌ హీరోగా.. సోనియా అగర్వాల్‌, స్నేహ హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘పుదుపేట’. సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. ఇపుడు ఈ మూవీ రెండో భాగాన్ని తెరకెక్కించాలని ధనుష్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. అదే సమయంలో ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో ‘పుదుపేట-2’ ఈ సంవత్సరమే ప్రారంభమవుతుందని దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రకటించారు. దీంతో కొక్కి కుమార్‌ మళ్లీ వస్తున్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌లో నటించేందుకు సోనియా అగర్వాల్‌ సమ్మతం తెలిపారు.

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ‘పుదుపేట 2’ చిత్రంలో నటించాలని నాకు వర్తమానం వస్తే కచ్చితంగా నటించేందుకు సమ్మతిస్తా. నటన నా వృత్తి. సెల్వతో కలిసి పని చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఇప్పటివరకు ఈ చిత్రంలో నటించాలని కోరుతూ నాకు ఎలాంటి పిలుపు రాలేదు. ఇందులో ఎవరెవరూ నటించనున్నారో కూడా నాకు తెలియదని వివరించారు. దీంతో అందరూ ఈ పార్ట్‌లో నటించమంటూ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మీరు చేయాలి మేడమ్ అని సోనియాను ఫ్యాన్స్ కోరుతున్నారు.


Sonia.jpg

సోనియా అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె నటించిన ‘7జి బృందావన కాలనీ’ చిత్రానికి, ఆ చిత్రంలోని ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇటీవల ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా.. మంచి ఆదరణ రాబట్టుకుంది. ఆ సినిమా టైమ్‌లో దర్శకుడు సెల్వను సోనియా పెళ్లాడింది. ఆ తర్వాత కొంత కాలానికే వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకోగా.. సోనియా అగర్వాల్ మరో పెళ్లి చేసుకోలేదు. అన్నీ కుదిరితే.. మళ్లీ వారిద్దరూ ‘పుదుపేట-2’ సినిమాకు కలిసి పని చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

====================

*Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రం విడుదలపై కీలక ప్రకటన

**********************

*Kayal Anandhi: ఆనంది ‘వైట్‌ రోజ్‌’ ఫస్ట్ లుక్‌ని ఎవరు విడుదల చేశారంటే..

*************************

*Harish Shankar: దమ్ముంటే హరీష్ శంకర్ తెల్లవార్లు మద్యం తాగాడని రాయ్..

***************************

Updated Date - Feb 13 , 2024 | 11:55 PM