మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sai Pallavi: సాయి పల్లవి సినిమా రీ రిలీజ్.. లేడీ పవర్ స్టార్ అని అనేది అందుకే..

ABN, Publish Date - Feb 06 , 2024 | 04:38 PM

సాయి పల్లవిని ఓ మూవీ ఈవెంట్‌లో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్.. ‘లేడీ పవర్ స్టార్’ అంటూ సంభోదించగా.. అప్పటి నుండి ఆమెను అంతా లేడీ పవర్ స్టార్ అంటూ పిలవడం మొదలెట్టారు. సాయి పల్లవి క్రేజ్ ఏంటనేది.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా ఆమె నటించిన ‘ప్రేమమ్’ చిత్రం రీ రిలీజై.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌ను రాబడుతోంది.

Sai Pallavi

సాయి పల్లవిని ఓ మూవీ ఈవెంట్‌లో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar).. ‘లేడీ పవర్ స్టార్’ (Lady Power Star) అంటూ సంభోదించగా.. అప్పటి నుండి ఆమెను అంతా లేడీ పవర్ స్టార్ అంటూ పిలవడం మొదలెట్టారు. సాయి పల్లవి క్రేజ్ ఏంటనేది.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. సుకుమార్ ఇచ్చిన బిరుదుకు తగ్గ అర్హురాలినని సాయి పల్లవి నిరూపిస్తూనే ఉంది. అదెలా అని అనుకుంటున్నారా? టాలీవుడ్‌లో రీ రిలీజ్ అయిన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన, చేస్తున్న విషయం తెలిసిందే. సేమ్ టు సేమ్.. ఇప్పుడు సాయి పల్లవి (Sai Pallavi) నటించిన ఓ సినిమా మలయాళం, తమిళ భాషల్లో రీ రిలీజై.. కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మలయాళంలో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్‌గా పేరొందిన ‘ప్రేమమ్’ (Premam) చిత్రాన్ని ఫిబ్రవరి 1వ తేదీన మలయాళం, తమిళ భాషల్లో రీ రిలీజ్ చేశారు. ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. ఇప్పటి వరకు రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి.. రీ రిలీజ్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఒక యువ‌కుడి జీవితంలో మూడు ద‌శ‌ల్లో సాగిన ప్రేమ కథని హైలెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా.. డైరెక్ట్ రిలీజ్‌లోనూ మంచి విజయాన్ని అందుకుంది. నవీన్ పాల్​, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్​, మడోన్నా సెబాస్టియన్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. యువసామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా టాలీవుడ్‌లో ఈ సినిమాను రీమేక్ కూడా చేశారు.


‘ప్రేమమ్’ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఇంతకు ముందు ఈ సినిమా రెండు సార్లు రీ రిలీజ్ అయింది.. ఇది మూడోసారి. మలయాళంలో కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ. 80 కోట్ల వరకు కలెక్షన్స్‌ను రాబట్టి.. అప్పట్లో అతి పెద్ద విజయంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ నమోదు చేసింది. ఈ సినిమాతో సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయం అవడమే కాకుండా.. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్‌ను అందుకున్న హీరోయిన్లుగా గుర్తింపును పొందారు. వీరిద్దరిలో ప్రముఖంగా సాయి పల్లవి క్రేజ్ ఏంటనేది ప్రస్తుతం అందరికీ తెలిసిందే. ఆమె సినిమా ఓకే చేస్తే చాలు.. అందులో కంటెంట్ కచ్చితంగా ఉంటుందనే క్రేజ్‌ని సాయి పల్లవి సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ రీ రిలీజ్ విషయంలో కూడా సాయి పల్లవి పేరే ప్రముఖంగా వినిపించడం విశేషం.


ఇవి కూడా చదవండి:

====================

*Super Star: ఇక ‘సూపర్‌స్టార్‌’ ట్యాగ్‌ చర్చకు తెరపడినట్టేనా? విజయ్ అభిమానులకు హితబోధ

*****************************

*Sudigali Sudheer: అయ్యో పాపం సారూ.. ఇట్టా బుక్కయ్యాడు

***************************

*హీరో విశాల్‌ - లైకా ప్రొడక్షన్ ఖాతాల ఆడిట్‌: హైకోర్టు ఆదేశం

*************************

*Guntur Kaaram: అఫీషియల్‌‌గా ‘గుంటూరు కారం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. విశేషమేమిటంటే?

************************

Updated Date - Feb 06 , 2024 | 04:38 PM