Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!

ABN , Publish Date - Feb 03 , 2024 | 09:38 PM

వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం వేసవికి విడుదల అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Love Guru: శోభనం రోజు.. భర్త ఎదురుగానే భార్య ఏం చేస్తుందో చూశారా!
Vijay Antony and Mrinalini Ravi in Love Guru

పై టైటిల్ కాస్త తేడాగా అనిపించినా.. పిక్‌లో ఉన్న మ్యాటర్ మాత్రం అదే కాబట్టి.. జస్టిఫికేషన్ జరిగినట్లే. సరే విషయంలోకి వస్తే.. వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony). ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’ (Love Guru) పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మృణాళిని రవి (Mrinalini Ravi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర అప్‌డేట్‌ను మేకర్స్ వదిలారు.


Love-Guru.jpg

సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్.. సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర పోస్టర్‌ని (Love Guru Movie Poster) విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. ఇందులో.. శోభనం రోజు గదిలో భార్య మృణాళిని రవి రమ్ గ్లాస్ రమ్ పోస్తుంటే.. భర్త విజయ్ ఆంటోని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఆయన చేతిలో పాల చెంబు ఉంటే.. ఆమె చేతిలో మందు గ్లాస్ ఉంది. భార్య భర్తలుగా విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇలా సింబాలిక్‌గా పోస్టర్ ద్వారా చూపించారు. ఈ పోస్టర్‌తో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించనుంది. వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నా ఈ చిత్రానికి భరత్ ధనశేఖర్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?

**********************

*Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

**************************

*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం

**************************

*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

**************************

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

Updated Date - Feb 03 , 2024 | 09:38 PM