Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

ABN , Publish Date - Feb 03 , 2024 | 03:29 PM

‘భారతరత్న’.. ఎల్‌కే అద్వానీకి ఎంతో అర్హమైన గౌరవమని అన్నారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. ట్విట్టర్ వేదికగా ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానం చేయనున్నట్టు ప్రధాని మోదీ శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..
Chiranjeevi and LK Advani

‘భారతరత్న’ (Bharat Ratna).. ఎల్‌కే అద్వానీ (LK Advani)కి ఎంతో అర్హమైన గౌరవమని అన్నారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ట్విట్టర్ వేదికగా ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ (Bharat Ratna) ప్రదానం చేయనున్నట్టు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.


LK-Advani.jpg

ప్రధాని మోదీ నుండి ఈ ప్రకటన వచ్చిన అనంతరం నుండి.. అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా.. ‘‘భారతరత్న పురస్కారం నిస్సందేహంగా శ్రీ ఎల్‌కే అద్వానీజీకి ఎంతో అర్హమైన గౌరవం. మన దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. స్వాతంత్ర్యానికి పూర్వం మరియు అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది. అద్వానీజీ వంటి దిగ్గజాలు రాజకీయాలు మరియు రాజకీయ నాయకుల స్థాయిని అలాగే గౌరవాన్ని పెంచారు. ఆయనకు నా హృదయ పూర్వక అభినందనలు’’ అని తన సంతోషాన్ని తెలియజేశారు. (Chiranjeevi Wishes to LK Advani)


ఇవి కూడా చదవండి:

====================

*Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

****************************

*‘లాల్‌సలాం’కు ధన్య బాలకృష్ణ రూపంలో చిక్కులు?.. సారీ చెప్పిన నటి..!

***************************

*HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్

****************************

*Family Star: ‘దేవర’ డేట్‌కే ఫిక్సయిన ‘ఫ్యామిలీ స్టార్’.. అయోమయంలో తారక్ ఫ్యాన్స్‌

*****************************

*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..

*************************

Updated Date - Feb 03 , 2024 | 04:01 PM