‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:44 PM

‘సప్త సాగరాలు దాటి’ సిరీస్ సినిమాల‌తో మంచి సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సిరీస్ చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సును సైతం దోచుకున్నాయి. ఇక ఈ సినిమాల అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను చేయ‌బోతున్నారు.

‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?
Sapta Sagaralu Dhaati Director Hemanth M Rao Next Film

‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) సిరీస్ సినిమాల‌తో మంచి సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు (Director Hemanth M Rao). 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సిరీస్ చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సును సైతం దోచుకున్నాయి. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా న‌టించింది. ఇక ఈ సినిమాల అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు దర్శకుడు హేమంత్ ఎమ్ రావు. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) హీరోగా.. హేమంత్ ఎమ్ రావు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను చేయ‌బోతున్నారు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉండబోతున్నట్లుగా స‌మాచారం. వైశాక్ జె ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ జె గౌడ ఈ సినిమాను నిర్మించనున్నారు.


Vaishak-j-Films.jpg

‘గోధిబన్న సాధారణ మైకట్టు, కవలుదారి, భీమసేన నలమహారాజు, సప్త సాగరాలు దాటి’ వంటి డిఫరెంట్ జాన‌ర్‌ చిత్రాల త‌ర్వాత హేమంత్ ఎమ్ రావు డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడంతో పాటు.. ఫస్ట్ టైమ్ ఆయన యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో.. ఈ సినిమాపై అప్పుడే అంచ‌నాలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్ లాంటి స్టార్ట్‌తో చేయడం సంతోషంగా ఉందని.. ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచిందని.. నిర్మాత వైశాక్ జె గౌడ ఈ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా తెలియజేశారు. (Sapta Sagaralu Dhaati Director Next Film Update)


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

*Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

****************************

*‘లాల్‌సలాం’కు ధన్య బాలకృష్ణ రూపంలో చిక్కులు?.. సారీ చెప్పిన నటి..!

***************************

*HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్

****************************

Updated Date - Feb 03 , 2024 | 04:48 PM