Rakul Preet Singh: జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం

ABN , Publish Date - Feb 21 , 2024 | 10:58 PM

దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. రకుల్, జాకీ కుటుంబాల నుండి అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరవగా.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍తో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలెందరో ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.

Rakul Preet Singh: జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం
Rakul Preet Singh and Jackky Bhagnani

దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక వైభవంగా జరిగింది. రకుల్, జాకీ కుటుంబాల నుండి అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరవగా.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍తో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలెందరో ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.

Rakul-Wedding.jpg

ఇరు కుటుంబాలకు చెందిన పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో రకుల్ - జాకీ వివాహం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rakul-Wedding-Photos.jpg


వాస్తవానికి రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుకలు ఫిబ్రవరి 19 నుండే మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే పార్టీలు, ఫంక్షన్లు గ్రాండ్‍గా సెలబ్రేట్ చేస్తూ వచ్చారు. మంగళవారం సంగీత్ ఫంక్షన్ జరిగింది. బుధవారం రకుల్ - జాకీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Rakul-1.jpg

రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమికులయ్యారు. తాము ప్రేమలో ఉన్నామని 2021 అక్టోబర్‌లో రకుల్ - జాకీ ప్రకటించారు. రకుల్ పుట్టిన రోజునే ఈ విషయాన్ని వెల్లడించారు.

Rakul-Marriage-2.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

*****************************

*Kanguva: ‘కంగువ’ అప్డేట్ వచ్చింది..

************************

*Nikhil and Pallavi: పేరెంట్స్‌గా ప్రమోషన్.. చంటిబిడ్డతో నిఖిల్ ఫొటో వైరల్

******************************

*DPIFFA 2024: ఈ అవార్డ్ అంటే ఎంతో ఇష్టం.. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న షారుక్ స్పందనిదే..

***********************************

Updated Date - Feb 21 , 2024 | 11:03 PM