Nikhil and Pallavi: పేరెంట్స్‌గా ప్రమోషన్.. చంటిబిడ్డతో నిఖిల్ ఫొటో వైరల్

ABN , Publish Date - Feb 21 , 2024 | 02:21 PM

నిఖిల్, పల్లవి దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. నిఖిల్ భార్య పల్లవి పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నిఖిల్ అభిమానులు, ప్రేక్షకులు నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Nikhil and Pallavi: పేరెంట్స్‌గా ప్రమోషన్.. చంటిబిడ్డతో నిఖిల్ ఫొటో వైరల్
Nikhil with His Baby Boy

నిఖిల్, పల్లవి (Nikhil and Pallavi) దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. నిఖిల్ భార్య పల్లవి పండంటి బాబుకు (Baby Boy) జన్మనిచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్ సంతోషం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నిఖిల్ అభిమానులు, ప్రేక్షకులు నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ చాలా వరకు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

అలాగే ఇప్పుడున్న యంగ్ హీరోలలో నిఖిల్ (Nikhil) ప్రత్యేక స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’ అనే మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో కత్తులు, యుద్ధాలు, గుర్రపు స్వారీ.. ఇలాంటి వన్నీ ఉంటాయనేలా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో రెండు మూడు సినిమాలు కమిటై ఉన్నారు.


Nikhil-and-His-Baby-Boy.jpg

అంతకుముందు తను తండ్రి కాబోతోన్న విషయాన్ని తన భార్య సీమంతపు ఫొటో‌ని షేర్ చేసి మరీ చెప్పిన నిఖిల్.. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డ కోసం డైపర్ క్లాస్‌లు నేర్చుకుంటున్నట్లుగా మరో పిక్‌ని షేర్ చేశారు. దీంతో.. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా? అని నిఖిల్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ సంతోషకరమైన సమయం వచ్చేసింది. నిఖిల్, పల్లవి దంపతులు పేరేంట్స్‌గా ప్రమోషన్ పొంది.. మరో నూతన స్టేజ్‌కి చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*DPIFFA 2024: ఈ అవార్డ్ అంటే ఎంతో ఇష్టం.. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న షారుక్ స్పందనిదే..

***********************************

*Gaami: ఆసక్తికరంగా ‘గామి’ క్యారెక్టర్స్ టీజర్.. విశ్వక్ సేన్‌‌కే సమస్య!

******************************

*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

**************************

Updated Date - Feb 21 , 2024 | 02:32 PM