Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 21 , 2024 | 04:45 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో చిత్రబృందం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గురించి అడిగిన ప్రశ్నకు.. వరుణ్ తేజ్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు
Mega Prince Varun Tej

మా బాబాయ్‌కి, జనసేన పార్టీకి ఎప్పుడూ నా మద్దతు ఉంటుందని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej). ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్రయూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానమిచ్చారు.

ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. జనసేన పార్టీ (Janasena Party) తరపున ప్రచారం చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో నేను చెబుతున్నాను. నా పూర్తి మద్దతు బాబాయ్‌కి ఉంటుందని. కళ్యాణ్ బాబాయ్ (Pawan Kalyan) ఐడియాలజీపై నాకు నమ్మకం ఉంది. నా మద్దతు ఎప్పుడూ బాబాయ్‌కి, జనసేన పార్టీకి ఉంటుంది. గతంలో కూడా పార్టీ కోసం ప్రచారం చేశాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేయాలని నాకు ఆదేశాలు వస్తే మాత్రం.. తప్పకుండా ప్రచారానికి వెళ్తాను’’ అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.


Varun.jpg

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా విశేషాలు తెలుపుతూ.. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా ఇప్పటివరకూ టాలీవుడ్‌ (Tollywood)లో ఇలాంటి సినిమా రాలేదు. దేశభక్తి నేపథ్యంగా ఉంటుందీ సినిమా. మార్చి 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతుంది. ‘కంచె’ (Kanche) సినిమా నాకు ఎంతో గుర్తింపును తెచ్చింది. నా కెరీర్‌లో ఇలాంటి సినిమా చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నా. పుల్వమా ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 14న పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగింది. అదేరోజు వాలెంటైన్ డే కావడంతో సినిమాకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine Movie) అని పేరు పెట్టడం జరిగింది. ఇందులో యుద్ధ విమానాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. సినిమా ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా యూత్‌కి స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kanguva: ‘కంగువ’ అప్డేట్ వచ్చింది..

************************

*Nikhil and Pallavi: పేరెంట్స్‌గా ప్రమోషన్.. చంటిబిడ్డతో నిఖిల్ ఫొటో వైరల్

******************************

*DPIFFA 2024: ఈ అవార్డ్ అంటే ఎంతో ఇష్టం.. ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న షారుక్ స్పందనిదే..

***********************************

Updated Date - Feb 21 , 2024 | 04:45 PM