Kalki 2898AD: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ చారిత్రాత్మక డేట్‌కే!

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:33 PM

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

Kalki 2898AD: రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ చారిత్రాత్మక డేట్‌కే!
Kalki 2898AD Movie Still

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin), వైజయంతి మూవీస్ మ్యాసీవ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD). వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ని 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడిక విడుదల తేదీ వంతొచ్చింది.

పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌ అనగానే గుర్తొచ్చే సినిమాలు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘మహానటి’. వేరు వేరు సంవత్సరాలలో విడుదలైనప్పటికీ.. ఈ రెండు సినిమాలు విడుదలైన తేదీ మాత్రం ఒకటే. మే 9. అందుకే ఈ తేదీని చారిత్రాత్మక డేట్‌గా ఆ బ్యానర్ పరిగణిస్తుంది. ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’ని కూడా అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ విషయం తెలుపుతూ ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. (Kalki 2898AD Release Date)


Kalki-Release-Date.jpg

ఈ పోస్టర్‌లో ‘కల్కి’ అవతార్‌లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఓ సూపర్ హీరోలా ప్రభాస్ కనిపిస్తోన్న ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే రీసెంట్‌గా వచ్చిన ‘సలార్’తో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. మరోసారి తన సత్తా చాటేందుకు మే లోనే వస్తున్నాడనేలా ఫ్యాన్స్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇంతకు ముందు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేలా చేసిన ఫ్యాన్స్‌కి 2023లో 2 సినిమాలతో ఖుషి చేశాడు ప్రభాస్. అలాగే ఈ 2024లోనూ రెండు సినిమాలతో ట్రీట్ ఇవ్వబోతున్నాడనేది.. ఈ అప్‌డేట్‌తో తెలియవస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కూడా ఇదే సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

====================

*Vijay: విజయ్‌ న్యూ గెటప్‌.. అసలు విజయ్‌లా లేడు కదా!

*************************

*HanuMan: ‘హను-మాన్’ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ఇచ్చారంటే..

**********************

*Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే

***********************

Updated Date - Jan 12 , 2024 | 01:40 PM