Vijay: విజయ్‌ న్యూ గెటప్‌.. అసలు విజయ్‌లా లేడు కదా!

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:15 PM

అగ్ర హీరో విజయ్‌ కొత్త గెటప్‌లో కనిపించి తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా కొత్త గెటప్‌లో వారితో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఆయన అభిమానులు తెగ సంబరబడి పోయారు. ‘లియో’ తర్వాత విజయ్‌ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు చిత్రంలో నటిస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం’ టైటిల్‌ను ఖరారు చేశారు. వర్కింగ్‌ టైటిల్‌గా ‘గోట్‌’ అని పెట్టారు.

Vijay: విజయ్‌ న్యూ గెటప్‌.. అసలు విజయ్‌లా లేడు కదా!
Kollywood Star Hero Vijay

అగ్ర హీరో విజయ్‌ (Vijay) కొత్త గెటప్‌లో కనిపించి తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా కొత్త గెటప్‌లో వారితో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఆయన అభిమానులు తెగ సంబరబడి పోయారు. ‘లియో’ (Leo) తర్వాత విజయ్‌ ప్రస్తుతం వెంకట్‌ ప్రభు చిత్రంలో నటిస్తున్నారు. ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం’ టైటిల్‌ను ఖరారు చేశారు. వర్కింగ్‌ టైటిల్‌గా ‘గోట్‌’ (GOAT) అని పెట్టారు. ఇందులో జయరాం, ప్రభుదేవా, మోహన్‌, ప్రశాంత్‌, వైభవ్‌, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం. ఏజీఎస్‌ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతోంది.


Vijay-pic.jpg

ఈ చిత్ర షూటింగ్‌ సమయంలో లొకేషన్‌కు వచ్చిన అభిమానులను విజయ్‌ కలుసుకున్నారు. వారితో సెల్ఫీ దిగారు. పైగా ఆయన మీసాలు లేకుండా కొత్త గెటప్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఫొటోను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. ఈ ఫొటో విడుదలకాక ముందు సోషల్ మీడియాలో.. అసలీ ఫొటో విజయ్‌దేనా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంతమంది అయితే అసలు నమ్మలేదు కూడా. విజయ్ డబుల్ అంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు. కానీ మేకర్స్ అఫీషియల్‌గా పిక్‌ని విడుదల చేసిన తర్వాతగానీ.. ఆ పిక్‌లో ఉన్నది విజయ్ అని ఫ్యాన్స్ కూడా నమ్మలేకపోయారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. (Vijay New Makeover)


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: ‘హను-మాన్’ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ఇచ్చారంటే..

**********************

*Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే

***********************

*King Nagarjuna: రాసిపెట్టికోండి.. కిష్టయ్య బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు

*************************

Updated Date - Jan 12 , 2024 | 12:19 PM