Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:41 PM

ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుండి మేకర్స్ మేకింగ్ వీడియోని వదిలారు. ఈ వీడియో చూస్తుంటే హిట్టు కళ కొట్టిచ్చినట్లు కనబడుతోంది. ఇందులో ఆర్టిస్ట్‌లందరినీ చూపించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్‌ని తెలిపేలా ఉన్న ఈ మేకింగ్ వీడియోలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వాగ్ చూసి.. సలామ్ చేయాల్సిందే అనేలా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు.

Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే
Mahesh Babu In Guntur Kaaram

ఇంకొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుండి మేకర్స్ మేకింగ్ వీడియోని వదిలారు. ఈ వీడియో చూస్తుంటే హిట్టు కళ కొట్టిచ్చినట్లు కనబడుతోంది. ఇందులో ఆర్టిస్ట్‌లందరినీ చూపించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ స్టైల్‌ని తెలిపేలా ఉన్న ఈ మేకింగ్ వీడియోలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వాగ్ చూసి.. సలామ్ చేయాల్సిందే అనేలా ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు. ఫైట్స్, కామెడీ సీన్లు.. ఇలా అది, ఇది అని కాకుండా.. అన్నిరకాలుగా ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్లాస్, మాస్, ఫ్యామిలీ లేదా యూత్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగల, అన్ని వర్గాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అరుదైన స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అందిస్తూ, మాస్ ప్రేక్షకుల నుండి కూడా అదేస్థాయిలో ప్రశంసలు పొంది ఎంతో ఖ్యాతిని సంపాదించారు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు చేసిన ‘అతడు, ఖలేజా’ కల్ట్ క్లాసిక్‌లు‌గా నిలిచాయి. ఇప్పుడు 14 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు మాములుగా ఉండవు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరిస్థితి అదే.


Mahesh.jpg

గుంటూరుకు చెందిన రమణగా మహేష్ బాబు తన కోసం రాసిన మాస్ పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోయారు. ఆయన పాత్ర తీరుని తెలుపుతూ విడుదల చేసిన గ్లింప్స్.. అలాగే టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుని సినిమాపై ఎక్కడాలేని అంచనాలను పెంచేశాయి. ఈసారి మహేష్ బాబు సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆయన చెప్పే డైలాగ్స్, ఆయన యాటిట్యూడ్, ఆయన ఎనర్జీ అన్నీ కూడా ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా ఉన్నాయి. దాదాపుగా మహేష్ శైలి ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్నేహపూర్వక శైలిని, మాస్ పాత్రలలో బాడీ లాంగ్వేజ్‌ని గుర్తు చేస్తుంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరామ్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


ఇవి కూడా చదవండి:

====================

*King Nagarjuna: రాసిపెట్టికోండి.. కిష్టయ్య బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు

*************************

*Deviyani Sharma: ఆ హీరో సరసన నటించాలన్నదే నా జీవితాశయం

***************************

*Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..

***********************

*Janhvi Kapoor: ప్రేమలో పడిపోయా.. నాని ‘హాయ్ నాన్న’పై జాన్వీకపూర్

************************

Updated Date - Jan 11 , 2024 | 12:43 PM