మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ రిలీజ్ డేట్ మారింది.. విడుదల ఎప్పుడంటే?

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:53 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ సంస్థకు ఎంతో విశిష్టమైన రోజున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఉన్నారు. కానీ ఈ చిత్రం ఆ రోజున అనగా మే 9వ తేదీన విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

Kalki 2898 AD Movie Still

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) క్రేజీ కాంబినేష్‌లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థకు ఎంతో విశిష్టమైన రోజున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించి ఉన్నారు. కానీ ఈ చిత్రం ఆ రోజున అనగా మే 9వ తేదీన విడుదల కావడం లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. (Kalki 2898 AD New Release Date)

*Tamannaah Bhatia: డబ్బులు కోసం చూసుకోకుండా ఒప్పుకుంటే చిక్కులు తప్పవు మరి

‘కల్కి 2898 AD’ చిత్రం ముందు చెప్పిన మే 9వ తేదీన కాకుండా.. జూన్ 27 (June 27)వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోందని తెలుపుతూ.. ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు.. దీపికా పదుకొణె, అమితాబచ్చన్ కూడా ఉన్నారు. ఇదొక వార్ సీన్‌లా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మే 09 తేదీన ఈ సినిమా విడుదల కాకపోవడానికి కారణం.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలతో (Elections) పాటు ఐపీఎల్ (IPL 2024) అని కూడా తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను జూన్ 27కు మేకర్స్ వాయిదా వేశారు.


ఇక ఈ సినిమా చిత్రీకరణను వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడటం లేదనేది ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ చూస్తుంటే తెలుస్తోంది. రీసెంట్‌గా ప్రభాస్, దీపికలతో పాటు అమితాబ్ లుక్స్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియోలు, అంతకు ముందు విడుదల చేసిన టీజర్.. ఎటువంటి స్పందనను రాబట్టుకున్నాయో తెలియంది కాదు. జూన్‌లో ప్రేక్షకులను మరో సరికొత్త ప్రపంచంలోకి ఈ చిత్రం తీసుకెళుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Apr 27 , 2024 | 05:53 PM