Kalki 2898 AD: 'కల్కి' కోసం నటకిరీటి..!

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:11 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్  తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే! మే 9వ తేదిన విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

Kalki 2898 AD:  'కల్కి' కోసం నటకిరీటి..!

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్  తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 Ad) చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే! మే 9వ తేదిన విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఫాంటసీ  సైన్స్  ఫిక్షన్  చిత్రంగా పాన్  వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కుతుంది. పలు అగ్ర తారలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రలో, కోలీవుడ్‌ విశ్వనాయకుడు కమల్‌హాసన్  ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మరో అగ్ర నటుడు ఈ చిత్రం లో భాగం కానున్నారు. 

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra prasad) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మాసీవ్‌ ప్రాజెక్ట్‌లో రాజేంద్ర ప్రసాద్‌ ఉన్నారంటే ఆ పాత్ర తప్పకుండా కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. మరి తనని నాగ్‌ అశ్విన్‌ ఎలా ఆవిష్కరిస్తాడో వేచి చూడాలి. ప్రభాస్‌ సరసన కథానాయికగా బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్  నిర్మిస్తున్నారు.

దీపికా ప్రస్తుతం గర్భవతి. సెప్టెంబర్‌లో ఆమెకు డెలివరీ డేట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆమెపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మిగిలిన పార్టును కూడా త్వరగా తెరకెక్కించడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

Updated Date - Mar 01 , 2024 | 11:11 AM