మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, రిషభ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. ఏంటి కథ?

ABN, Publish Date - Mar 02 , 2024 | 09:56 AM

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి కలిసి ఉన్నారు. దీంతో వీరంతా ఎందుకిలా ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారనేలా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Jr NTR With Rishab Shetty and Prashanth Neel

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty) కలిసి ఉన్నారు. దీంతో వీరంతా ఎందుకిలా ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారనేలా సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ (Devara) సినిమా అనంతరం ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. అంత వరకు ఓకే. మరి ఫ్రేమ్‌లో రిషభ్ శెట్టి ఎందుకొచ్చాడబ్బా? అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ అనుమానాలకు చెక్ పెట్టేలా.. ప్రశాంత్ నీల్ ఇంట్లో ఏదో ఫంక్షన్ నిమిత్తం వీరంతా ఇలా కలిశారనేలా టాక్ వినబడుతోంది. ‘కాంతార’ సినిమా టైమ్‌లో హీరో రిషభ్ శెట్టి తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో ప్రకటించారు. ఇప్పుడాయన ప్రశాంత్ నీల్ ఇంట్లో ఇలా కనిపించడంతో.. వెంటనే ఫొటోలకు ఫోజులిచ్చారనేలా సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. (NTR with Rishab Shetty and Prashanth Neel at Private Event)


అదీ కాక, హోంబలే ఫిల్మ్స్‌కి, ప్రశాంత్ నీల్‌కి, రిషభ్ శెట్టికి మంచి అనుబంధం ఉంది. అందుకే.. ప్రశాంత్ నీల్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు రిషభ్ శెట్టి హాజరయ్యాడనేలా మరోవైపు టాక్. ఏదిఏమైతేనేం.. సినీ దిగ్గజాలు ఒకేచోట, ఒకే ఫ్రేమ్‌లో ఇలా కనిపించి.. వారి ఫ్యాన్స్‌కి ఆనందాన్నిచ్చారు. అన్నట్లుగా ఈ ఫ్రేమ్‌లో ఎన్టీఆర్ భార్య ప్రణతి (Pranathi), మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Tamannaah: ‘ఓదెల 2’ లో..

********************************

*Rashmika Mandanna: టోక్యో ఎయిర్ పోర్ట్‌లో రష్మికకు సర్‌ప్రైజింగ్ వెల్కమ్

********************************

*Prashanth: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు

****************************

Updated Date - Mar 02 , 2024 | 10:48 AM