Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

ABN , Publish Date - Jan 04 , 2024 | 06:33 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్ధమైంది.

Guntur Kaaram: సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?
Mahesh Babu in Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రాబోయే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతోంది. సంక్రాంతికి వస్తుందా? రాదా? అనే డౌట్ నుండి.. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెన్సార్ నుండి ఈ చిత్రానికి యు బై ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేశారు. సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ సినిమా అనేలా.. సెన్సార్ నుండి ఈ సినిమాకు సూపర్బ్ పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ టాక్ విన్న తర్వాత నిర్మాత నాగవంశీ ట్విట్టర్ ద్వారా టాక్ ఎలా ఉంటుందనేది తెలియజేశారు. ‘‘చూడగానే మజా వస్తుంది.. హార్ట్ బీట్ పెరుగుతుంది.. ఈల వేయాలి అనిపిస్తుంది’’ అని నాగవంశీ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా రిపోర్ట్‌ని తెలియజేశారు. అంతేకాదు, నేను చెప్పిన ఈ మాట, అలాగే ఈ డేట్‌ని గుర్తు పెట్టుకోండి అంటూ చాలా ధీమాగా చెప్పుకొచ్చారు. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టర్ పక్కా అనేలా అయితే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (Guntur Kaaram Censor Details)


Mahesh-Babu.jpg

టాలీవుడ్ క్రష్ శ్రీలీల, మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*దీనస్థితిలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌కు ‘మనం సైతం’ సాయం

**************************

*Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

************************

*Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!

*******************************

*Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?

*******************************

Updated Date - Jan 04 , 2024 | 06:41 PM