Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ RC 16పై ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

ABN , Publish Date - Feb 22 , 2024 | 08:36 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’. ఈ సినిమాతో అతిలోకసుందరి శ్రీదేవి తనయ తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సౌత్‌లో ఆమె రెండు సినిమాలకు సైన్ చేసినట్లుగా తండ్రి బోనీ కపూర్ ప్రకటించగా.. ఆయన ప్రకటనను తాజాగా జాన్వీ తోసిపుచ్చింది. తనని సంప్రదించకుండానే తన తండ్రి ఆ ప్రకటన చేశారని చెబుతూ.. RC16పై ట్విస్టిచ్చింది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ RC 16పై ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?
Janhvi Kapoor and Ram Charan

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాతో అతిలోకసుందరి శ్రీదేవి (Sridevi) తనయ తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలవకుండానే జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సౌత్‌లో బిజీ తారగా మారబోతుందంటూ ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమెకు సౌత్ నుంచి పలు అవకాశాలు తలుపు తడుతున్నట్లుగా టాక్ వినబడుతోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందని.. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchibabu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న RC16లోనూ జాన్వీ కపూరే హీరోయిన్ అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపధ్యంలో.. జాన్వీ తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor) కూడా ఈ వార్తలు నిజమే అనేలా చెప్పుకొచ్చారు. కానీ జాన్వీ కపూర్ తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం ఓ ట్విస్ట్ ఇచ్చింది. అదేంటంటే..

ముందుగా బోనీ కపూర్ విషయానికి వస్తే.. నా కుమార్తె జాన్వీకి సౌత్‌లో అవకాశాలు బాగా వస్తున్నాయి. నా భార్య శ్రీదేవి కూడా అన్ని ఇండస్ట్రీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడామె బాటలోనే జాన్వీ కూడా పయనిస్తోంది. ప్రస్తుతం ఆమె తారక్ సరసన ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే సౌత్‌లో సూర్య సరసన ఓ సినిమా, రామ్ చరణ్ సరసన మరో సినిమాకు సైన్ చేసిందని బోనీ కపూర్ రీసెంట్‌గా ప్రకటించారు. అయితే తన అనుమతి లేకుండా, తనతో సంప్రదించకుండా తన తండ్రి.. ఏవేవో సినిమాలు ప్రకటించేశారంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. (Boney Kapoor about Janhvi Kapoor Next Projects)


Jahnvi.jpg

‘‘రీసెంట్‌గా మా నాన్న.. నన్ను సంప్రదించకుండానే నా తదుపరి సినిమాలు ఇవేనంటూ ఓ ప్రకటన చేశారు. ఆయన చెప్పిన సినిమాల గురించి నేనేం చెప్పలేను కానీ.. ప్రస్తుతం నేను మాత్రం ‘దేవర’ (Devara), ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr & Mrs Mahi), ‘ఉలఝ్‌’ (Ulajh) సినిమాలకు మాత్రమే వర్క్ చేస్తున్నాను’’ అని సెలవిచ్చింది. ఆమె నుండి ఈ ప్రకటన వచ్చిన అనంతరం.. సూర్య, రామ్ చరణ్‌ల సినిమాలలో ఆమె నటించడం లేదా? లేదంటే ఇంకా ఓకే కాలేదా? ఎందుకిలా జాన్వీ రియాక్ట్ అయింది? అనేలా రియాక్ట్ అవుతున్నారు. (Janhvi Kapoor Next Projects)


ఇవి కూడా చదవండి:

====================

*BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?

**************************

*Rakul Preet Singh: జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం

*************************

*Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

*****************************

Updated Date - Feb 22 , 2024 | 08:36 PM