Pawan Kalyan: ఓజీ.. సినిమా షూటింగ్స్‌పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:05 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి వెళ్లారు. బుధవారం సాయంత్రం అక్కడ జరిగిన ‘వారాహి బహిరంగ సభ’లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా తన అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని అరుస్తుంటే.. తను అంగీకరించిన సినిమాల షూటింగ్స్ గురించి పవన్ కళ్యాణ్ ఈ సభలో క్లారిటీ ఇచ్చారు.

AP Deputy CM Pawan Kalyan

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనను బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) తొలిసారి వెళ్లారు. బుధవారం సాయంత్రం అక్కడ జరిగిన ‘వారాహి బహిరంగ సభ’లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా తన అభిమానులు ‘ఓజీ ఓజీ’ అని అరుస్తుంటే.. తను అంగీకరించిన సినిమాల షూటింగ్స్ గురించి పవన్ కళ్యాణ్ ఈ సభలో క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్స్ గురించి డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మాట్లాడుతూ..

‘‘ఓజీనా.. సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి.. ముందు ఒక మూడు నెలలు మీకోసం (ప్రజలు) వర్క్ చేయాలి. కనీసం రోడ్డుకు గుంతలు కూడా పూడ్చలేదు అని తిట్టుకోకూడదు కదా. గ్రామాలకు కొత్త రోడ్లు కంటే ముందు ఉన్న గుంతలైనా పూడ్చాలి. మళ్లీ నన్ను తిట్టుకోకూడదు కదా.. మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు వెళ్లి ఓజీ ఓజీ ఏంటి అని క్యాజీ అంటే నేనేం చెప్పను. ఆ భయంతోనే.. నిర్మాతలకు కూడా చెప్పాను. కాస్త నన్ను క్షమించాలి అని. మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాస్త సేవ చేసుకుని.. కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులో, మూడు రోజులో షూటింగ్ చేస్తాను.. ఎక్కడా పనికి అంతరాయం రాకుండా అని చెప్పాను. ఓజీ చూద్దురుగానీ.. బాగుంటుంది’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. (Pawan Kalyan on Movie Shootings)


OG.jpg

ఓజీ విషయానికి వస్తే.. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్ (Sujeeth) దర్శకుడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్‌ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హాస్మీ, అర్జున్ దాస్‌, ప్రకాష్‌రాజ్‌, శ్రియా రెడ్డి, హరీష్‌ ఉత్తమన్, అజయ్‌ఘోష్‌ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నా. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా చాలా మేరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే.. శరవేగంగా పూర్తి చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 08:13 PM