Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.. ఎందుకంటే?

ABN , Publish Date - May 16 , 2024 | 08:40 PM

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరో లేఖలో మే 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించారు.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.. ఎందుకంటే?
Pawan Kalyan

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) అభ్యర్ధిగా పోటీ చేసిన తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan).. మరో లేఖలో మే 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేసి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున విడుదల చేసిన లేఖలో ఏముందంటే.. (Pawan Kalyan Letter to AP People)


Janasena-Letter.jpg

‘‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారం

ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియావారు, పౌర సంఘాలవారు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు..’’ అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2024 | 08:40 PM