Kurma Nayaki: వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్

ABN, Publish Date - Mar 05 , 2024 | 03:01 PM

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న నటి ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళ నటి అయినప్పటికీ.. ఆమె టాలీవుడ్‌లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. మంగళవారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘కూర్మనాయకి’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.