Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Feb 14 , 2024 | 06:25 PM

‘డీజే టిల్లు’ చిత్రంతో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రేంజే మారిపోయింది. ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్‌ డేని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.