Amaran: శివకార్తికేయన్ ‘అమరన్’ మూవీ టీజర్

ABN, Publish Date - Feb 16 , 2024 | 07:10 PM

స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా.. ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ‘అమరన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. శివకార్తికేయన్ బర్త్‌డే స్పెషల్‌గా శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.