Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

ABN , Publish Date - Feb 16 , 2024 | 02:00 PM

అనేక రంగాల్లో తమదైన టాలెంట్ చాటిన 30 ఏళ్ల లోపు యువతీయువకులతో ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ప్రతి ఏడాది ‘30 అండర్ 30’ జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఈసారి నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నాకు చోటు లభించింది. ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న రష్మికపై విజయ్ దేవరకొండ ఇన్‌స్టా వేదికగా ప్రశంసలు కురిపించారు.

Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..
Rashmika Mandanna and Vijay Deverakonda

అనేక రంగాల్లో తమదైన టాలెంట్ చాటిన 30 ఏళ్ల లోపు యువతీయువకులతో ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ప్రతి ఏడాది ‘30 అండర్ 30’ జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఈసారి నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు చోటు లభించింది. ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ (Forbes India 30 Under 30) జాబితాలో చోటు దక్కించుకున్న ఆమెపై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా రష్మికను అభినందిస్తూ.. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై రష్మిక ఉన్న పిక్‌ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. ‘‘ఇలా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు మరింతగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ.. అందరికీ స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తన ఇన్‌స్టా స్టేటస్‌లో చెప్పుకొచ్చారు. అంతకు ముందు తనకు దక్కిన ఈ గౌరవంపై రష్మిక మందన్నా స్పందిస్తూ.. తన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. రష్మిక చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా.. ‘అంతా మీ టాలెంట్’ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Forbes-Rashmika.jpg

ఇక విజయ్, రష్మికల విషయానికి వస్తే.. వీరిద్దరికి పెళ్లంటూ వార్తలు రావడం, ఆ వార్తలను వారు ఖండించడం అదే పనిగా జరుగుతూ వస్తుంది. అయితే, వారిద్దరి చర్యలు మాత్రం.. ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉందనే ఫీలింగ్‌ని ఇచ్చేలా ఉండటంతో.. ఇలాంటి వార్తలు పదే పదే చోటు చేసుకుంటున్నాయి. రష్మిక మందన్నా ఇటీవల క్లారిటీగా చెప్పింది.. తనకు విజయ్ దేవరకొండ ఎంత ఇంపార్టెంటో. అందరికంటే కూడా విజయ్ తనని బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు విజయ్ చేసిన పోస్ట్ కూడా ఆమెను ఎంకరేజ్ చేసేలానే ఉంది అంటూ నెటిజన్లు కొందరు రియాక్ట్ అవుతుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: ‘సుందరం మాస్టర్’కు మెగాస్టార్ సపోర్ట్.. ఏం చేశారంటే?

***************************

*‘ఏజెంట్’ బాటలోనే సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’.. కాకపోతే?

***********************

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

Updated Date - Feb 16 , 2024 | 02:00 PM