Manamey: ‘వరల్డ్ ఆఫ్ మనమే’ మూవీ గ్లింప్స్

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:50 AM

శర్వానంద్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘మనమే’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం శర్వానంద్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వరల్డ్ ఆఫ్ మనమే’ పేరుతో మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (HBDSharwanand)