Bhamakalapam 2: ‘భామాకలాపం 2’ ట్రైలర్

ABN, Publish Date - Feb 10 , 2024 | 06:04 PM

విలక్షణ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ మూవీ ఆహాలో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ను తీసుకువస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఆహా ఒరిజినల్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 16 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.