Roti Kapda Romance: ‘ఓ మై ఫ్రెండ్’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Mar 12 , 2024 | 07:36 PM

నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ మై ఫ్రెండ్’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుద‌ల చేశారు.