My Dear Donga: ‘మై డియర్ దొంగ’ మూవీ టీజర్

ABN, Publish Date - Mar 05 , 2024 | 04:27 PM

ఆహాలో తాజాగా సరికొత్త వెబ్ ఫిల్మ్ ‘మై డియర్ దొంగ’ త్వరలోనే సందడి చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను టీమ్ విడుదల చేసింది. అభినవ్ గోమటం, షాలిని కొండెపూడి ప్రధాన తారాగణంగా నటించిన ఈ ఒరిజినల్‌ మూవీని ఆహా, కేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాయి. బి.ఎస్.సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. స్త్రీ సాధికారతను తెలియజేసేలా రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని షాలిని కొండెపూడి రచించటం విశేషం.