Babu: ‘కన్నే అదిరిందే’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Feb 16 , 2024 | 03:53 PM

అర్జున్ కళ్యాణ్ హీరోగా, కుషిత కల్లాపు హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘బాబు’. ట్యాగ్ లైన్ ‘నెంబర్ వన్ బుల్ షిట్ గై’. డీడీ క్రియేషన్స్ బ్యానర్‌పై దండు దిలీప్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎల్ఆర్ (లక్ష్మణ్ వర్మ) ఈ సినిమాకు దర్శకుడు. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ‘కన్నే అదిరిందే’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.