Naa Saami Ranga: ‘ఇంకా ఇంకా దూరమే’ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Jan 11 , 2024 | 02:26 PM

కింగ్ నాగార్జున, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంక్రాంతి విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుండి తాజాగా ‘ఇంకా ఇంకా దూరమే’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.