Ambajipeta Marriage Band: ‘గుమ్మ’ వీడియో సాంగ్

ABN, Publish Date - Feb 09 , 2024 | 08:20 PM

సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు దుశ్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుండి ‘గుమ్మ’ అంటూ సాంగే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.