Devara Part 1: ‘దేవర’.. ఫియర్ సాంగ్ వీడియో

ABN, Publish Date - May 21 , 2024 | 04:04 PM

మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా.. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్ పార్టు షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్‌ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డేని పురస్కరించుకుని మేకర్స్ ‘ఫియర్’ సాంగ్‌ని విడుదల చేశారు.

Updated at - May 21 , 2024 | 04:04 PM