Devara: 'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది!

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:29 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr Ntr) - జాన్వీ కపూర్‌(janhvey kapoor) జోడీగా నటిస్తున్న చిత్రం 'దేవర' v(Devara). యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు.

Devara:  'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది!

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr Ntr) - జాన్వీ కపూర్‌(janhvey kapoor) జోడీగా నటిస్తున్న చిత్రం 'దేవర' (Devara). యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. శుక్రవారం సెట్‌లో ఉన్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. మేకర్స్‌. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతి మరాఠే (Shrutii Marrathe) తొలి సారి ఈ చిత్రం గురించి మాట్లాడింది. 'దేవర'లో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది.

Shruthi.jpg

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. ‘దేవరలో సినిమాలో నేను యాక్ట్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఈ సినిమాలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఆ పాత్ర నాకెంతో ప్రత్యేకం. అక్టోబర్‌ 10న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. శ్రుతీ మరాఠే మాటలను బట్టి ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు అని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌లో కనిపిస్తారని కూడా క్లారిటీ వచ్చింది. జాన్వీకపూర్‌ ఈ చిత్రంలో తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - Mar 23 , 2024 | 11:18 AM