Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’.. దద్దరిల్లే అప్‌డేట్

ABN , Publish Date - May 12 , 2024 | 04:04 PM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా నుండి దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ బ్లాస్ట్ మాస్ యాక్షన్ ధమాకేధార్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Double iSmart: ‘డబుల్ ఇస్మార్ట్’.. దద్దరిల్లే అప్‌డేట్
Ram in Double iSmart

డబుల్ ఇంపాక్ట్‌తో ఇస్మార్ట్ మ్యాడ్ నెస్ క్రియేట్ చేసే సమయం ఆసన్నమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh), ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni)ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart). ఈ సినిమా నుండి దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ బ్లాస్ట్ మాస్ యాక్షన్ ధమాకేధార్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

*Vote: టాలీవుడ్ అగ్ర న‌టులు.. ఓటు ఎక్క‌డ వేయ‌నున్నారంటే!


టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌ని ఫేస్ మాస్క్‌తో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించారు. పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి, ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని ఉన్న రామ్ దిమాకికిరికిరి టీజర్‌‌ని ప్రామిస్ చేసే పోస్టర్‌లో ఇంటెన్స్ లుక్‌తో అదరగొడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది, ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొంటుంది. త్వర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నందున, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో ముందుకు రానున్నారు. (Double iSmart Teaser Release Update)


Ram.jpg

ఈ సీక్వెల్‌లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటున్నారు మేకర్స్. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ డబుల్ ఇస్మార్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. (Double iSmart Movie)

Read Latest Cinema News

Updated Date - May 12 , 2024 | 04:04 PM