Vote: టాలీవుడ్ అగ్ర న‌టులు.. ఓటు ఎక్క‌డ వేయ‌నున్నారంటే!

ABN , Publish Date - May 12 , 2024 | 03:37 PM

మే 13 (సోమ‌వారం) రోజున‌ పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా ఇప్ప‌టికే అధికారులు అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేప‌థ్యంలో మ‌న టాలీవుడ్ సినీ తార‌లు ఎక్క‌డెక్క‌డ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారంటే..

Vote: టాలీవుడ్ అగ్ర న‌టులు.. ఓటు ఎక్క‌డ వేయ‌నున్నారంటే!

నిన్న‌టితో రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం హాడావుడి ముగిసిన విషయం తెలిసిందే. మే 13 (సోమ‌వారం) రోజున‌ పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా ఇప్ప‌టికే అధికారులు అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పైగా వేస‌వి ఎండ‌ల నేప‌థ్యంలో పోలింగ్ స‌మ‌యాన్ని కూడా పెంచిన‌ అధికారులు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

vote.jpg

ఈ నేప‌థ్యంలో సాధార‌ణ పౌరుల‌తో పాటు సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, రేపు వారి వారికి కేటాయించ‌బ‌డిన కేంద్రాల‌కు వెల్లి వేయనున్నారు. ఈ క్ర‌మంలో మ‌న టాలీవుడ్ సినీ తార‌లు ఎక్క‌డెక్క‌డ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారంటే..


చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్‌లు జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో, అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో, మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ ,శ్రీకాంత్‌ , జీవిత రాజశేఖర్‌.. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో, రాజమౌళి రమారాజమౌళి.. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో, వెంకటేశ్, బ్రహ్మానందం.. మణికొండ హైస్కూల్‌లో ఓటు వేయ‌నున్నారు.

chiru.jpg

అదేవిధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి.. ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో, రాఘవేంద్రరావు, రాజశేఖర్‌ , విశ్వక్‌సేన్‌ , దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు.. ఎఫ్‌ఎన్‌సీసీలో, నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్.. వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో, రవితేజ.. జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో, రామ్ పోతినేని.. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో, నాని.. గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో, సుధీర్ బాబు.. దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో, అల్లరి నరేశ్.. రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ ఆర్థిక సహకార సంస్థ కార్యాల‌యంలో, తనికెళ్ల భరణి.. యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేయ‌నున్నారు.

voting-pic.jpg

Updated Date - May 12 , 2024 | 03:38 PM