‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ అరుదైన ఘ‌న‌త‌! ఆ భాష‌లో.. మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ సినిమా

ABN , Publish Date - May 27 , 2024 | 11:56 AM

ర‌వితేజ క‌థ‌నాయ‌కుడిగా వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. చెవిటి , మూగ వారి కోసం ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న తొలి భార‌తీయ చిత్రంగా చ‌రిత్ర‌లోకి ఎక్కింది.

‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ అరుదైన ఘ‌న‌త‌! ఆ భాష‌లో.. మొట్ట‌మొద‌టి ఇండియ‌న్ సినిమా
raviteja

క‌రోనా త‌ర్వాత ఓటీటీల ప్రాబ‌ల్యం పెర‌గ‌డంతో ప్రపంచంలోని అన్ని భాష‌ల సినిమాలు మారుమూల ప‌ల్లెలోని ప్రేక్ష‌కుడి ముందుకే రావ‌డ‌మే గాక‌ వారి వారి భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ మ‌న‌లాగా విన‌లేని, మాట్లాడ‌లేని (బ‌ధిరుల‌) ప‌రిస్థితి ఏంటనే విష‌యం చాలామందికి అంతుబ‌ట్ట‌క పోవ‌చ్చు. అలాంటి వారి కోసం ఇప్ప‌టికే సైన్ లాంగ్వేజ్ ఉన్నా మ‌న దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు దానిపై దృష్టి పెట్టిన అన‌వాళ్లు ఎక్కువ‌గా లేవు. గ‌తంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌తి ఆదివారం వ‌చ్చే బ‌ధిరుల వార్త‌ల వ‌ర‌కు మాత్ర‌మే మ‌న‌కు ఓ ఐడియా ఉంది. ఈ సైన్ లాగ్వేజ్ బ‌య‌టి దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో ఉన్న‌ప్ప‌టికీ మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఈ భాష‌పై అవ‌గాహ‌న వ‌స్తోంది.

tigernageswararao-raviteja.jpg

అయితే ర‌వితేజ (RaviTeja) క‌థ‌నాయ‌కుడిగా గ‌త ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. చెవిటి , మూగ వారి కోసం ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌న‌త ద‌క్కించుకున్న తొలి భార‌తీయ చిత్రంగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చ‌రిత్ర‌లోకి ఎక్కింది. వంశీ (Vamsee) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా అభిషేక్ అగ‌ర్వాల్ (Abhishek Agarwal) నిర్మించారు, జీవీ ప్ర‌కాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందించారు. నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో మిశ్ర‌మ స్పంద‌న‌తో ఈ సినిమా బావుంద‌నే పేరు తెచ్చుకున్న‌ప్ప‌టికీ లాభాలు మాత్రం తీసుకురాలేక పోయింది.


ఇదిలాఉండ‌గా గ‌తంలో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన 83 చిత్రాన్ని కూడా ఈ సైన్ లాంగ్వేజ్‌లో తీసుకు వ‌చ్చినా ఫ‌స్ట్ టైం టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు చిత్రం మాత్ర‌మే మ‌న భార‌తీయ సైన్ లాంగ్వేజ్‌(Indian Sign Language)లో ఓటీటీలో విడుద‌ల అవుతున్న‌ చిత్రంగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమేర‌కు ఈ సినిమా నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ భాష‌లో ప్ర‌తి విష‌యంలోనూ చేతులు, చేతి వేళ్లు, కళ్లు, ముఖ కవళికలు, శరీర హావభావాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒకేసారి కనుబొమ్మలను, చేతి వేళ్ల‌ను కదుపుతూ చేసే ప్ర‌క్రియ ద్వ‌రానే సినిమా గురించి చూసే వారికి వివ‌రిస్తారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న‌ది. ఆస‌క్తి ఉన్న‌వారు ఓక‌సారి ఈ చిత్రాన్ని చూడ‌వ‌చ్చు.

Updated Date - May 27 , 2024 | 12:15 PM