TFPC: సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు

ABN , Publish Date - May 16 , 2024 | 06:43 PM

కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ అంటూ వినిపిస్తున్న వార్తలలో నిజంలేదని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని ఈ లేఖలో స్పష్టం చేశారు.

TFPC: సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు
TFPC Statement about Single Screen Theaters Stop

కొన్ని రోజులుగా థియేటర్ల బంద్ అంటూ వినిపిస్తున్న వార్తలలో నిజంలేదని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council) అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce), తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TS Film Chamber of Commerce) మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ (TFPC)కు సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని ఈ లేఖలో స్పష్టం చేశారు. అసలీ లేఖలో ఏముందంటే..

*Love Me: ‘లవ్ మీ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్


‘‘ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా, గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రాలోని మరికొన్ని ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు చెల్లించలేకపోతున్నారనే కారణాన్ని చూపెడుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లు మా దృష్టికి వచ్చింది. అదే విధంగా తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారం తమ థియేటర్లను ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శన రద్దు చేయడమైనది అని పెట్టేవారు. ఇది ప్రధానంగా ఎన్నికలు మరియు IPL కారణంగా జరిగింది, తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలియజేస్తున్నాము. (Single Screen Theatres Stop)

*Kevvu Kartheek: నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు


సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరియు ప్రింట్ మీడియాలలో సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని అపెక్స్ బాడీలకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అందుకే థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియజేస్తున్నాం. ఇది తక్కువ వసూళ్లు రావడంతో థియేటర్లను మూసివేసిన కొందరు థియేటర్ యజమానుల వ్యక్తిగత నిర్ణయం. దీనికి సంబంధించి, పైన పేర్కొన్న అన్ని అపెక్స్ బాడీస్ అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు సినిమా థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేయబడింది. మా సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాయి..’’ అని టిఎఫ్‌పిసి సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ (T. Prasanna Kumar) ఈ లేఖలో పేర్కొన్నారు.


TFPC.jpg

మరో ప్రకటనలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌‌ కూడా థియేటర్ల బంద్ ఎగ్జిబిటర్స్ వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. ‘సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదు’ అని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్‌‌కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌‌ అధ్యక్షులు సునీల్ నారంగ్ (Sunil Narang), సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి (K Anupam Reddy) ఈ ప్రకటన విడుదల చేశారు.

TSFCC.jpg

Read Latest Cinema News

Updated Date - May 16 , 2024 | 06:43 PM