Jai Hanuman: ప్ర‌తి ఒక్క‌రూ.. గుర్తు పెట్టుకునేలా ‘జై హ‌నుమాన్’! ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్ట్ వైర‌ల్

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:52 PM

హ‌నుమాన్ చిత్రం త‌ర్వాత ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్‌లో భాగంగా త‌దుప‌రి వ‌స్తోన్న చిత్రం జై హ‌నుమాన్. తాజాగా సినిమా నుంచి ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Jai Hanuman: ప్ర‌తి ఒక్క‌రూ.. గుర్తు పెట్టుకునేలా ‘జై హ‌నుమాన్’! ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్ట్ వైర‌ల్
jai hanuman

హ‌నుమాన్ (Hanuman) వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్‌లో భాగంగా త‌దుప‌రి వ‌స్తోన్న చిత్రం జై హ‌నుమాన్ (Jai Hanuman). ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ మొద‌ల‌వ‌గా తాజాగా ఈ రోజు శ్రీరామ‌న‌మి సంద‌ర్భంగా సినిమా నుంచి ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ (Prasanth Varma) విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్ సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.


ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ.. ఈ శ్రీరామన‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్యంగా భార‌త‌దేశ‌పు అభిమానుల‌కు మాటిస్తున్నా రానున్న జై హనుమాన్‌ సినిమాతో ప్ర‌తి ఒక్క‌రూ జీవితాంతం గుర్తు పెట్టుకునే మంచి అనుభూతిని అందిస్తా అన్నారు. అంతేగాక ఆ పోస్టుకు రాముడికి హ‌నుమంతుడు మాటిచ్చే పోస్ట‌ర్‌ను ట్యాగ్ చేశారు. కాగా ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా టాలీవుడ్ అగ్ర న‌టుడు లీడ్ రోల్‌లో న‌టించ‌నున్నాడు.

Updated Date - Apr 17 , 2024 | 04:00 PM