ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమైన హిట్ కాంబినేషన్..

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:25 PM

శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచిని చాటుకున్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.‌ అగ్ర కథానాయిక సమంత ‘యశోద’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు.‌ లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’కి సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమైన హిట్ కాంబినేషన్..

శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచిని చాటుకున్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad).‌ అగ్ర కథానాయిక సమంత (Samantha) ‘యశోద’ (Yashoda)తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు.‌ లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’కి సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohan Krishna Indraganti)తో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.


Sivalenka-Krishna-Prasad.jpg

మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో వచ్చిన తొలి సినిమా నాని ‘జెంటిల్ మన్’ (Gentleman). బాక్సాఫీస్ విజయంతో పాటు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ‌ రావు హైదరీ జంటగా సూపర్ హిట్ సినిమా ‘సమ్మోహనం’ (Sammohanam) చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రియదర్శి కథానాయకుడిగా నటించనున్నారు. హీరోగా ‘బలగం’ సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాకు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..

*************************

*Sree Vishnu: ‘రాజ రాజ చోర’ కాంబినేషన్ రిపీట్.. ఈసారి అచ్చతెలుగు సినిమా!

**************************

*Save The Tigers: ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 1’ ఫ్రీ స్ట్రీమింగ్.. ఎప్పటి వరకంటే?

******************************

Updated Date - Feb 29 , 2024 | 04:25 PM