RAM: ‘సైంధవ్’ డైరెక్టర్ వదిలిన ‘రామ్’ ట్రైలర్.. ఎలా ఉందంటే?

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:46 AM

దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా ‘రామ్‌’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా దీపికాంజలి వడ్లమాని నిర్మించిన సినిమా ‘రామ్‌’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ‘సైంధవ్’ దర్శకుడు శైలేష్ కొలను విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RAM: ‘సైంధవ్’ డైరెక్టర్ వదిలిన ‘రామ్’ ట్రైలర్.. ఎలా ఉందంటే?
RAM Movie Still

దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా ‘రామ్‌’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా దీపికాంజలి వడ్లమాని నిర్మించిన సినిమా ‘రామ్‌’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్). మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల (Surya Ayyalasomyajula) హీరోగా పరిచయం అవుతుండగా, ధన్యా బాలకృష్ణ (Dhanya Balakrishna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ‘సైంధవ్’ (Saindhav) దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది.. గెలుస్తావ్ కదా?’ అంటూ తండ్రి చెప్పే మాటలతో ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఈ 60 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రజలది కాదు.. అధికారులది కాదు.. రాజకీయ నాయకులది మాత్రమే.. మీరు అప్పుడూ బానిసలే.. ఇప్పుడూ బానిసలే.. ఎప్పుడూ బానిసలే’ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా నేపథ్యం ఏమిటనేది క్లారిటీ ఇస్తోంది. ఇలా సినిమాలో దేశభక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ ఉన్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. కళ్ళల్లో త్రివర్ణ పతాకాన్ని చూపించే షాట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తంగా.. సినిమాపై ఆసక్తిని పెంచడంలో ఈ ట్రైలర్ వందశాతం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. (RAM Theatrical Trailer)


Sailesh-Kolanu.jpg

కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*HanuMan: ‘హను-మాన్’ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ఇచ్చారంటే..

**********************

*Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే

***********************

*King Nagarjuna: రాసిపెట్టికోండి.. కిష్టయ్య బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు

*************************

*Deviyani Sharma: ఆ హీరో సరసన నటించాలన్నదే నా జీవితాశయం

***************************

*Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..

***********************

Updated Date - Jan 12 , 2024 | 10:46 AM