Rashmika Mandanna: అప్పట్లో అలా.. ఇప్పుడు మాత్రం ఇంకోలా!

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:53 AM

‘పుష్ప 2’ చిత్రంలో తన క్యారెక్టర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. ఇందులో శ్రీవల్లి 2.0ని చూస్తారని ఓ వేదికపై ఆమె అన్న మాటలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

 Rashmika Mandanna: అప్పట్లో అలా.. ఇప్పుడు మాత్రం ఇంకోలా!


‘పుష్ప 2’ (Pushpa2)చిత్రంలో తన క్యారెక్టర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika mandanna). ఇందులో శ్రీవల్లి 2.0ని (Srivalli2.O) చూస్తారని ఓ వేదికపై ఆమె అన్న మాటలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 'పుష్ప'తో నేషనల్‌ లెవల్లో గుర్తింపు పొందిన రష్మిక పుష్ప-2తో సందడి చేయడానికి రెడీ అవుతోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు  ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది రష్మిక.

Rashmika Mandanna

‘‘పుష్ప: ది రైజ్‌’లో అవకాశం వచ్చినప్పుడు ఆ కథ గురించి నాకు అంత అవగాహన లేదు. శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది? దానిలో డెప్త్‌, నేనే చేయగలనా లేదా అన్నది కూడా తెలియదు. ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నామో కూడా ఊహించలేకపోయాను. దీంతో ఎప్పుడూ సెట్లో అడుగు పెట్టినా ప్లే గ్రౌండ్‌లో తిరుగుతున్న భావన కలిగేది. కానీ.. ఇప్పుడు అలా కాదు. నా పాత్ర గురించి పూర్తిగా తెలుసు. దాని కోసం నేను ఎలాంటి కసరత్తులు చేయాలో కూడా ఓ ఐడియా వచ్చింది. దర్శకుడు  సీన్ చెబితే  అల్లుకుపోతా.  మొదటి భాగం కన్నా మరింత బలంగా నా పాత్ర ఉండబోతుంది. రాబోయే సీక్వెల్‌లో శ్రీవల్లి 2.0ను చూస్తారు. ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ‘డియర్‌ కామ్రేడ్‌’ నా హృదయానికి ఎంతో దగ్గరైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ ఇందులో నా నటనకు ఇప్పటికీ నేను ఎంతోమంది అభిమానులు ప్రశంసలు, ప్రేమను అందుకుంటున్నాను’’ అని తెలిపారు రష్మిక.  గత ఏడాది బాలీవుడ్‌లో యానిమల్‌ చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న ఆమె ఇటు సౌత్, అటు నార్త్‌లోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం రెయిన్  బో, ద గర్ల్‌ ఫ్రెండ్‌, ఛావా’ చిత్రాల్లో నటిస్తోంది. 

Srivalli.jpg

Seetha Kalyana Vaibhogame: అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘సీతా కళ్యాణ వైభోగమే’


Updated Date - Apr 15 , 2024 | 12:26 PM