Sasivadane: ‘శశివదనే’ విడుదల తేదీ ఫిక్సయింది

ABN , Publish Date - Feb 14 , 2024 | 09:43 PM

రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వదిలారు. సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Sasivadane: ‘శశివదనే’ విడుదల తేదీ ఫిక్సయింది
Sasivadane Movie Still

‘పలాస 1978’లో చేసిన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు రక్షిత్ అట్లూరి. అలాంటి రక్షిత్ అట్లూరి ప్రస్తుతం పూర్తి ప్రేమ కథా చిత్రంతో రాబోతోన్నారు. రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి హీరోయిన్‌గా ‘శశివదనే’ (Sasivadane) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రచయిత, దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన చేసిన ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మించారు. AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వదిలారు.

‘శశి వదనే’ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచుతూనే ఉంది. టీజర్‌తో ఈ చిత్రం ఎలా ఉంటుంది.. మళ్లీ గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Sasivadane Movie Release Date)


Sasivadane.jpg

‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ ఈ పోస్టర్ మీద హైలెట్‌ అవుతోంది. ఆ డైలాగ్‌తో సినిమాలోని విషయాన్ని మేకర్స్ చెప్పేశారు. స్వచ్చమైన గ్రామీణ ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, ప్రవీణ్ యండమూరి మరియు దీపక్ ప్రిన్స్ ఇతర కీలక పాత్రలలో నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Ramam Raghavam: ప్రేమికుల రోజు స్పెషల్‌గా ఎమోషనల్ గ్లింప్స్.. సుకుమార్ ఏమన్నారంటే?

***********************

*Tillu Square Trailer: ఈసారి దెబ్బ గట్టిగానే తగిలేటట్టుంది..

*************************

*Sonia Agarwal: నా మాజీ భర్తతో మళ్లీ చేసేందుకు రెడీ..

***************************

Updated Date - Feb 14 , 2024 | 09:43 PM