Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుంచి కీలక అప్‌డేట్

ABN , Publish Date - Feb 17 , 2024 | 10:04 PM

హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై అంచనాలను పెంచేసింది. నితిన్ పాత్రను పరిచయం చేసిన గ్లింప్స్ ఫన్నీగా ఉంది, అదే సమయంలో, కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ పరంగా సరికొత్త ఫీల్‌ని కలిగించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కీలక అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ నుంచి కీలక అప్‌డేట్
Nithiin in Robinhood

హీరో నితిన్ (Nithiin), టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’ (Robinhood). ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి యూనిక్, క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై అంచనాలను పెంచేసింది. నితిన్ పాత్రను పరిచయం చేసిన గ్లింప్స్ ఫన్నీగా ఉంది, అదే సమయంలో, కాన్సెప్ట్, ప్రెజెంటేషన్ పరంగా సరికొత్త ఫీల్‌ని కలిగించింది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కీలక అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ తాజాగా మున్నార్‌ (Munnar)లో పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన టాకీ పార్ట్, నితిన్, ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌ను చిత్రీకరించినట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


rabinhood.jpg

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది

**************************

*Vijay Deverakonda: ఫోర్బ్స్‌ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..

****************************

Updated Date - Feb 17 , 2024 | 10:04 PM