Chiranjeevi: ‘ఆపరేషన్ వాలెంటైన్’.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ లాంటిది

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:22 AM

‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలను చూడటం అనేది.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ చేయడం లాంటిదని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు.

Chiranjeevi: ‘ఆపరేషన్ వాలెంటైన్’.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ లాంటిది
Megastar Chiranjeevi

‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలను చూడటం అనేది.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ చేయడం లాంటిదని అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) నటించిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Chiru-1.jpg

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నాలుగైదు రోజుల క్రితం నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడు నాకు వరుణ్ తేజ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. జనరల్‌గా మెసేజ్ పెట్టడు. నేను ఊరిలో లేకపోవడంతో మెసేజ్ పెట్టాడు. డాడీ మీతో మాట్లాడాలని. ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేసేవాడు కదా.. అని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇండియాకు వచ్చిన తర్వాత మళ్లీ మెసేజ్ చేశాడు. నాకు ఈ సినిమాకు ఇలాంటి ఈవెంట్ ఒకటి జరుగుతుందనే ఆలోచన లేదు. సరే.. రమ్మని చెప్పాను. డాడీ.. ఇలా ఒక ఫంక్షన్ జరుగుతుంది.. మీరు ముఖ్య అతిథిగా రావాలి అని చెప్పాడు. చాలా సినిమాలకు నువ్వు ముఖ్య అతిథిగా వెళుతుంటావు. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే.. ఎప్పుడూ అడగను. ఎప్పుడో ‘ముకుంద’ సినిమాకు వచ్చావు.. ఆ తర్వాత ఎప్పుడూ అడగలేదు. కానీ ఈ సినిమాకు మీరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే, మీలాంటి వ్యక్తి.. మన బోర్డర్‌లో ఫైట్ చేసే హీరోల గురించి తీసిన ఇలాంటి సినిమా గురించి పది మందికి చెప్పేలా, మోటివేట్ చేసేలా మాట్లాడితే.. ఎంతో మందికి రీచ్ అవుతుందని పిలిచిన వెంటనే.. ఇది నాకు గొప్ప అవకాశం అని భావించాను. నేను రావడం వాళ్లకి అవకాశం కాదు.. మన కోసం, మన రక్షణ కోసం, సరిహద్దులలో పనిచేసే వారియర్స్ గురించి, గొప్ప హీరోల గురించి తీసిన సినిమా ఇలాంటి సినిమా గురించి నాలుగు మాటలు చెప్పడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. (Operation Valentine Pre release Event)


Megastar.jpg

ఇందులో ఉన్న పాయింట్ ఏమిటని నేను అడిగినప్పుడు.. పుల్వమాలో టెర్రరిస్ట్ అటాక్ సంబంధించిన కథ ఇదని తెలిసింది. పుల్వమా దాడిలో మన సైనికులు 40 మంది చనిపోయారు. ఆ సీన్లను చూస్తుంటే.. హృదయవిదారకంగా అనిపించింది. ఆ అమరులైన వారికి నివాళులు అర్పించేలా.. ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసినటువంటి సాహసం, యుద్ధమే ఈ సినిమా. మరి వాలెంటైన్ ఏంటి? అని వరుణ్‌ని అడిగా. ఫిబ్రవరి 14న ఈ సంఘటన జరిగిన సందర్భంగా.. మేము ఈ సినిమాకు ఆ పేరు పెట్టామని చెప్పాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’.. అప్పుడు టైటిల్ సెన్సిబుల్‌గా ఉందని అనిపించింది. రాజస్థాన్ నుంచి వచ్చిన యువకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు డైరెక్టర్. ఆయనేదో టాలీవుడ్‌లో డబ్బులు వస్తాయి.. నాలుగు కమర్షియల్ సినిమాలు చేసుకుందామని రాలేదు. ఈ సినిమాకు ముందు ఆయన సైనికులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. అది చూసిన ఎయిర్‌ ఫోర్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇలా ఎలా తీశావ్.. ఇలాంటి సీక్రెట్స్ బయటికి చెప్పకూడదు. నీకు ఎలా తెలిశాయి? అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా.. సినిమాగా చేస్తే మాత్రం మాకు చెప్పకుండా చేయవద్దని అన్నారు. ఈ సినిమా విషయంలో వారు ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిసింది. నిజంగా ఏం జరిగిందనేది.. వారు ఇచ్చిన ఇన్‌పుట్స్‌తో ఒక యదార్ధ గాథగా ఈ కథని రాసుకున్నాడు. కమర్షియల్ హంగులు ఎలాగూ ఉంటాయి. ఆ హంగులతోటి ఈ కథని నిర్మాతలకు చెప్పగానే.. అందరికీ నచ్చింది. అలా ఈ సినిమాను వారు నిర్మించారు. ఆద్యంతం అద్భుతంగా వచ్చిందని వారు చెబుతుంటే.. చాలా గొప్పగా అనిపించింది. (Operation Valentine)

Chiru-and-Varun.jpg

ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే, మనకు ఎలాంటి దేశభక్తి ఉన్నప్పటికీ.. ఇలాంటి సినిమాలతో ఆ దేశభక్తి ఉత్తేజం చెందుతుంది. జనగణమన మనకు వినబడగానే లేచి నిలబడతాం. అలాంటి సమయంలో మనకు తెలియకుండానే మన మనోగతం ఉప్పొంగుతుంది. అన్ని రకాల సినిమాలు చూస్తుంటారు కానీ.. ఇలాంటి సినిమాలను మాత్రం తప్పకుండా చూడాలి. ముఖ్యంగా యూత్.. మనకోసం సైనికులు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు చూడటం అనేది.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ లాంటిది. అందుకే చూడాలి.. చూసి తీరాలి. సినిమా రిలీజ్‌కు ముందే దర్శకుడు శక్తి సక్సెస్ అందుకున్నాడు. ఎందుకంటే.. ఇలాంటి సినిమాను, ఇలాంటి అవుట్‌ఫుట్‌ను ఆయన కేవలం 75 రోజుల్లో.. చాలా తక్కువ బడ్జెట్‌లో తీసి.. టాలీవుడ్‌‌కు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నవదీప్, అభినవ్.. ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు మంచి ఎఫర్ట్స్ కనబరిచారు. వరుణ్ తేజ్ మొదటి నుంచి మా ఫ్యామిలీలో వైవిధ్యభరిత సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో అందరినీ మరింతగా అలరిస్తాడని నమ్ముతున్నాను. ఈ సినిమాను చూసి.. మన సైనికులకు నివాళులు ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్లకు సెల్యూట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది..’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Anjali: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. నాకెంతో స్పెషల్ ఫిల్మ్

******************************

*Masthu Shades Unnai Ra: థ్యాంక్స్ మీట్‌‌లో నిర్మాత ఎమోషనల్.. ఎందుకంటే?

*************************

*Nani32: ‘OG’ దర్శకుడితో నాని చిత్రం.. అధికారిక ప్రకటన వచ్చేసింది

*****************************

Updated Date - Feb 26 , 2024 | 12:22 AM