Rajasaab: ప్రభాస్‌తో మారుతి టార్గెట్‌ అదే!

ABN , Publish Date - Apr 11 , 2024 | 10:32 AM

దర్శకుడు మారుతి సక్సెస్‌ సూత్రం వినోదం. ఇప్పటిదాకా ఆయన తీసిన చిత్రాలన్నీ వినోదాత్మక చిత్రాలే. ఇప్పుడు ఆయన పాన్ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో 'రాజాసాబ్‌’ సినిమా చేస్తున్నారు.

Rajasaab: ప్రభాస్‌తో మారుతి టార్గెట్‌ అదే!
Prabhas - The Raja saab


దర్శకుడు మారుతి (Maruthi) సక్సెస్‌ సూత్రం వినోదం. ఇప్పటిదాకా ఆయన తీసిన చిత్రాలన్నీ వినోదాత్మక చిత్రాలే. ఇప్పుడు ఆయన పాన్ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో (Prabhas) 'రాజాసాబ్‌’ (The Raja saab)సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్‌ మార్కెట్‌ వేరు. పాన్  వరల్డ్‌ స్థాయికి చేరుకున్నాడు. ఆయనతో సినిమా అంటు యూనివర్సెల్‌ సబ్జెక్ట్‌ ఉండాలి. అయితే ఇప్పటి దాకా ఒకే జోనర్‌లో చిత్రాలు చేసిన మారుతి.. ప్రభాస్‌తో సినిమాకు ఎలాంటి కథ ఎంచుకున్నారు? ఆయన్ను తెరపై ఏ విధంగా ఆవిష్కరించనున్నారు అన్నది ఆసక్తికర చర్చగా మారింది. సోషల్‌ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయినా జానర్‌ ఏంటనేది ఎవరకీ క్లారిటీ లేదు. చిత్ర బృందం కూడా ‘రాజాసాబ్‌’ కథ గురించి ఎక్కడా మాట్లాడలేదు. మారుతి బలం.. వినోదం. తన కామెడీ స్టైల్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అయితే ఆయన నుంచి ఆ తరహా చిత్రం వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పుడు ప్రభాస్‌ కాంబోలో ఆ తరహా చిత్రమే వస్తుందని అభిమానులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. పైగా ప్రభాస్‌ కూడా వినోదాత్మక చిత్రం చేసి చాలాకాలం అయింది. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో అలాంటి చిత్రం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రం గురించి మరో ట్విస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అదేంటి అంటే ఈ సినిమా ఓ విజువల్‌ ఫీస్ట్‌గా ఉండబోతోందట.

Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..



మారుతి ఎప్పుడూ లేని విధంగా ఈసారి గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ‘రాజాసాబ్‌’లో హారర్‌ కోణం ఉందని తెలిసింది. అయితే దానికి గ్రాఫిక్స్‌  జోడించి తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడట మారుతి. ద్వితీయార్థంలో వచ్చే ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఓ హారర్‌ సినిమాలో గ్రాఫిక్స్‌ని ఈ రేంజ్‌లో ఎవరూ వాడలేదని ఇన్‌సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మారుతికి మంచి విజువల్‌ సెన్స్‌ వుంది. సినిమాల్లోకి రాకముందు ఆయన సౌత్‌లో నెంబర్‌ వన్‌ యానిమేటర్‌. అయితే తన విజువల్‌ సెన్స్‌ని చూపించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. దాన్ని ‘రాజా సాబ్‌’ కోసం వాడబోతున్నారట. అయితే రాజాసాబ్‌ షూటింగ్‌ నెమ్మదిగా సాగుతోంది, ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరిగింది.  ఇప్పుడు మళ్లీ బ్రేక్‌ వచ్చింది. ఈ  గ్యాప్‌ లో మారుతి విజువల్‌ సెన్స్‌పై దృష్టి పెట్టాడని, దాన్ని తన సినిమాకు అనుకూలంగా మార్చుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.  గత షెడ్యూల్‌లో సంజయ్‌ దత్‌ పై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

Tamannaah: ‘బాక్’‌లో శివానిగా తమన్నా.. లుక్ అదిరింది


Updated Date - Apr 11 , 2024 | 10:39 AM