Gaami: జాహ్నవిగా చాందిని చౌదరి.. ఫస్ట్ లుక్ వదిలారు

ABN , Publish Date - Feb 22 , 2024 | 06:21 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా ‘గామి’. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి వదిలిన క్యారెక్టర్స్ టీజర్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఫిబ్రవరి 29న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి.. వెరీ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి లుక్‌ని మేకర్స్ పరిచయం చేశారు. చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Gaami: జాహ్నవిగా చాందిని చౌదరి.. ఫస్ట్ లుక్ వదిలారు
Chandini Chowdary in Gaami

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen) మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా ‘గామి’ (Gaami). రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి వదిలిన క్యారెక్టర్స్ టీజర్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఫిబ్రవరి 29న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి.. వెరీ టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary) లుక్‌ని మేకర్స్ పరిచయం చేశారు. చాందిని పాత్రను జాహ్నవి (Jahnavi)గా పరిచయం చేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Gaami-Vishwak.jpg

ఈ పోస్టర్‌లో చాందిని కళ్లజోడుతో పెక్యులర్‌గా వున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆమె వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్‌లో చూపించారు. చాందినితో పాటు విశ్వక్ చేసిన సాహస యాత్రను ఇందులో అద్భుతంగా చూపించనున్నారనే విషయం రీసెంట్‌గా వచ్చిన టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (Chandini Chowdary Look in Gaami)


Gaami.jpg

మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో ఇందులో విశ్వక్ సేన్ నటించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ సమర్పిస్తుంది. హారిక పెడాడ, మహ్మద్ సమద్ ఇతర తారాగణం. ఈ సినిమాకు విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ.. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత మరియు ప్రత్యూష్ వత్యం స్క్రీన్‌ప్లే భాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (Gaami Release Date)


ఇవి కూడా చదవండి:

====================

*BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?

**************************

*Rakul Preet Singh: జాకీ భగ్నానీతో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం

*************************

*Varun Tej: ‘జనసేన’పై వరుణ్ తేజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు

*****************************

Updated Date - Feb 22 , 2024 | 06:21 PM