Varalaxmi Sarathkumar: ‘శబరి’లో యాంగ్రీ యంగ్ లేడీ పాత్ర కాదు.. అంతా థ్రిల్ అవుతారు

ABN , Publish Date - Apr 24 , 2024 | 06:00 PM

వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

Varalaxmi Sarathkumar: ‘శబరి’లో యాంగ్రీ యంగ్ లేడీ పాత్ర కాదు.. అంతా థ్రిల్ అవుతారు
Varalaxmi Sarathkumar

వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’ (Sabari). మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల (Mahendra Nath Koondla) నిర్మించారు. అనిల్ కాట్జ్ (Anil Katz) దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Varalaxmi Sarathkumar Interview about Sabari Movie)

‘శబరి’ ప్రయాణం గురించి..?

‘క్రాక్’ సినిమాకు సంతకం చేయడానికి ముందే ‘శబరి’ కథ (Sabari Story) విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా ఇందులో చాలా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. 

*Satyabhama: కాజల్ ‘సత్యభామ’ నుంచి ‘కళ్లారా’ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే


దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు... ఈ సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?

లైఫే రిస్క్ అండీ. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. ‘హనుమాన్’ చిన్న సినిమా అనుకున్నారు.. పెద్ద హిట్ అయ్యింది. ‘నాంది’, ‘కోట బొమ్మాళీ పీఎస్’ సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. 

ఈ సినిమాపై మీకు నమ్మకం ఎలా కలిగింది?

‘శబరి’ ప్రెస్‌మీట్‌ చూస్తే అందరూ నిర్మాత గురించే మాట్లాడారు. ఎందుకంటే... ఆయన జెన్యూన్ పర్సన్. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగక ముందు పేమెంట్ వస్తుంది. ముందు అనుకున్న బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారు. (Varalaxmi Sarathkumar Interview)


Sarath-Kumar.jpg

గణేష్ వెంకట్రామన్ పాత్రేంటి? మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా?

సినిమాలో చూడండి. స్క్రీన్‌ప్లే ప్రధానంగా నడిచే సినిమా ‘శబరి’. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. 

యాంగ్రీ విమన్ రోల్స్, హీరోతో ప్యారలల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సమయంలో తల్లి పాత్ర అంటే రిస్క్ అనిపించలేదా?

నా తొలి సినిమా ‘పొడా పొడి’లో మదర్ రోల్ చేశా. ‘పందెం కోడి 2’లో చేశా. నేను ఓ యాక్టర్. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు. నటి అన్న తర్వాత అన్ని తరహా పాత్రలు చేయాలి. రిస్క్ అనుకుంటే ఇక్కడ ఉండలేం.

ఈ సినిమాలో మీ రోల్? ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్?

ఇందులో నేను యాంగ్రీ యంగ్ లేడీ కాదు.. ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించా. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచే పాత్ర. ఆమెకు ఏమైంది? అనేది కథ. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. (Varalaxmi Sarathkumar About Sabari)

మెయిన్ లీడ్ చేసేటప్పుడు ప్రెజర్ ఏమైనా అనిపించిందా?

హిట్టూ ఫ్లాపులు నా చేతుల్లో లేవు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. ప్రేక్షకులు నచ్చే నటన ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు నా పెర్ఫార్మన్స్ బాలేదని అనుకోకూడదు.

నిర్మాతకు మరో సినిమా చేస్తానని మాటిచ్చారట!

చేస్తాను. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తాను.

varam.jpg

మీ సినిమాల గురించి కాబోయే భర్త నికోలయ్ ఏం చెబుతారు?

బాలేదంటే బాలేదని చెబుతారు. బావుందంటే బావుందని చెబుతారు. ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదు (నవ్వులు). ఇప్పటి వరకు బావుందని చెప్పారు. 

మీ పెళ్లి ఎప్పుడు? (Varalaxmi Sarathkumar Marriage)

ఈ ఏడాదే అనుకుంటున్నాం.

నెక్స్ట్ సినిమాలు? (Varalaxmi Sarathkumar Next Movies)

‘కూర్మ నాయకి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో ధనుష్ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్ ‘మ్యాక్స్’‌లో చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యాక ఆ వివరాలు చెబుతాను.

Read Latest Cinema News

Updated Date - Apr 24 , 2024 | 06:00 PM