Manamey: శర్వానంద్ సినిమా ‘మనమే’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Mar 26 , 2024 | 02:33 PM

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న 35వ చిత్రం ‘మనమే’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మొదలెట్టారు. ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. మార్చి 28న ‘మనమే’ మూవీ ఫస్ట్ సింగిల్ ‘ఇక నా మాటే’ విడుదల కానుంది.

Manamey: శర్వానంద్ సినిమా ‘మనమే’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..
Sharwanand in Manamey Movie

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న 35వ చిత్రం ‘మనమే’ (Manamey). ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత. అతి త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మొదలెట్టారు. ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు.

సక్సెస్ ఫుల్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్‌తో మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఇక నా మాటే’ (Ika Naa Maate) అంటూ సాగే పాటను మార్చి 28న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ పోస్టర్‌లో తెలియజేశారు. ఈ సాంగ్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శర్వానంద్ షేడ్స్‌తో ట్రెండీ అవతార్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్‌లో స్కేటర్ రైడింగ్ చేస్తున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.


Maname.jpg

యూనిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య (Vikram Adittya) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తోన్న ఈ చిత్రానికి అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ డైలాగ్స్‌ని అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Chiranjeevi: హీరో శ్రీకాంత్ ఇంట్లో చిరు.. మ్యాటర్ ఇదే..

******************************

*Chiranjeevi: ‘అదే రక్తం.. అదే పౌరుషం’ డైలాగ్‌ని మార్చిన చిరు..

**************************

Updated Date - Mar 26 , 2024 | 02:33 PM