మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Veppam Kulir Mazhai: సంతానోత్పత్తి ఒత్తిడి సమస్యలపై సినిమా.. త్వరలోనే విడుదల

ABN, Publish Date - Mar 22 , 2024 | 01:53 PM

కొత్తగా వివాహమైన దంపతులు ఎదుర్కొంటున్న సంతానోత్పత్తి, మానసిక ఒత్తిడి సమస్యలకు పరిష్కార మార్గం చూపే చిత్రంగా ‘వెప్పం కులిర్‌ మళై’ తెరకెక్కింది. ‘కుట్రం కడిదల్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టరుగా జాతీయ అవార్డును అందుకున్న ఫాస్కల్‌ వేదముత్తు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. నిర్మాత ధీరవ్‌ ఇందులో హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది.

Veppam Kulir Mazhai Still

కొత్తగా వివాహమైన దంపతులు ఎదుర్కొంటున్న సంతానోత్పత్తి, మానసిక ఒత్తిడి సమస్యలకు పరిష్కార మార్గం చూపే చిత్రంగా ‘వెప్పం కులిర్‌ మళై’ (Veppam Kulir Mazhai) తెరకెక్కింది. ‘కుట్రం కడిదల్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టరుగా జాతీయ అవార్డును అందుకున్న ఫాస్కల్‌ వేదముత్తు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. నిర్మాత ధీరవ్‌ ఇందులో హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా వ్యవహరించారు. ఇస్మత్‌ బాను (Ismath Banu) హీరోయిన్‌. సీనియర్‌ నటుడు ఎం.ఎస్‌. భాస్కర్‌ (MS Bhaskar) ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమా వివరాలను తెలిపేందుకు దర్శకుడు తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు ఫాస్కల్‌ వేదముత్తు (Pascal Vedamuthu) మాట్లాడుతూ... బాహ్య, సామాజిక అంశాలు మానసిక, శారీరక అస్థిరతకు దారి తీస్తాయనే అంశాన్ని ప్రధానంగా ఇందులో చూపించాం. ఈ మూవీ సింహభాగం మానవ సంబంధాలు, భావోద్వేగాలను అన్వేషించేలా సాగుతుంది. ‘అసురన్‌’ చిత్రంలో ఇస్మత్‌ బాను ఒక పాటలో కనిపించినప్పటికీ ఆమె నటన ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. సీనియర్‌ నటుడు ఎంఎస్‌ భాస్కర్‌ పాత్ర చాలా బాగా వచ్చింది. అత్తగారి పాత్రను నటి రమ పోషించారు. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నామని తెలిపారు.


ఎఫ్‌డీఎఫ్ఎస్‌ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకు పృథ్వీరాజేంద్రన్‌ ఛాయాగ్రహణం అందించగా.. సంగీత బాధ్యతలను శంకర్‌, రంగరాజన్‌ నిర్వహించారు. కాగా, ఈ మూవీ ఫస్ట్ లుక్ అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ట్రైలర్‌ను దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran) విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Allu Arjun: మరో రికార్డ్ బద్దలైంది.. ఐకాన్‌స్టార్‌ని ఆపతరమా..

************************

*Thalakona: కశ్మీర్ యాపిల్‌‌లా ఉండే అప్సరా రాణి.. కశ్మీర్ మిర్చి‌లా..

*********************

*Earthquake: జపాన్‌లో భూకంపం.. 28వ అంతస్తులో రాజమౌళి ఫ్యామిలీ..!

***********************

Updated Date - Mar 22 , 2024 | 01:53 PM