Govt Awards: నేడు ప్రభుత్వ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఏ సినిమా కంటే?

ABN , Publish Date - Mar 06 , 2024 | 10:38 AM

రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరానికి సినీ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నై, రాజా అన్నామలై మండ్రంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ, తమిళ భాషాభివృద్ధి శాఖామంత్రి స్వామినాథన్‌ పాల్గొని అవార్డులను అందజేయనున్నారు. ఉత్తమ చిత్రాలకు బంగారు పతకంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తారు.

Govt Awards: నేడు ప్రభుత్వ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఏ సినిమా కంటే?
Tamil Nadu Government Film Awards 2015

రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరానికి సినీ అవార్డులను (Tamil Nadu Government Film Awards 2015) ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నై, రాజా అన్నామలై మండ్రంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ, తమిళ భాషాభివృద్ధి శాఖామంత్రి స్వామినాథన్‌ (Saminathan) పాల్గొని అవార్డులను అందజేయనున్నారు. ఉత్తమ చిత్రాలకు బంగారు పతకంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తారు. కాగా, 2015 సంవత్సరానికిగాను ప్రభుత్వం ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలివే..


Aravind-Swamy.jpg

(Tamil Nadu Government Film Awards 2015)

ఉత్తమ చిత్రం: తనిఒరువన్‌ (మొదటి బహుమతి) (Thani Oruvan)

ఉత్తమ చిత్రం: పసంగ -2 (రెండో బహుమతి) (Pasanga 2)

ఉత్తమ చిత్రం: ప్రభ (మూడో బహుమతి) (Prabha)

ఉత్తమ చిత్రం స్పెషల్‌ అవార్డు: ఇరుదిచుట్రు (Iruthichuttu)

ఉత్తమ మహిళా చిత్రం: 36 వయదినిలే (36 Vayathinile)

ఉత్తమ నటుడు: ఆర్‌.మాధవన్‌ (ఇరుదిచుట్రు)

ఉత్తమ నటి: జ్యోతిక (36 వయదినిలే)

ఉత్తమ నటుడు స్పెషల్‌ అవార్డు: గౌతం కార్తీక్‌ (ఇరుదిచుట్రు)

ఉత్తమ ప్రతి నాయకుడు: అరవింద్‌ స్వామి (తనిఒరువన్‌)

ఉత్తమ హాస్య నటుడు: సింగంపులి (అంజిక్కు ఒండ్రు)

ఉత్తమ హాస్య నటి: దేవదర్శిని (తిరుట్టుకళ్యాణం)

ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌: తలైవాసల్‌ విజయ్‌ (అపూర్వమహాన్‌)

ఉత్తమ క్యారెక్టర్‌ నటి: గౌతమి (పాపనాశం)

ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు: సుధా కొంగర (ఇరుదిచుట్రు)

ఉత్తమ కథా రచయిత: మోహన్‌ రాజా (తనిఒరువన్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: జిబ్రాన్‌ (ఉత్తమ విలన్‌)

ఉత్తమ గేయరచయిత: వివేక్‌ (36 వయదినిలే)

ఉత్తమ నేపథ్యగాయకుడు: ‘గానా’ బాలా (వై రాజా వై)

ఉత్తమ నేపథ్యగాయని: కల్పనా రాఘవేంద్ర (36 వయదినిలే)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రాంజీ (తనిఒరువన్‌)

ఉత్తమ కళా దర్శకుడు: ప్రభాకరన్‌ (పసంగ-2),

ఉత్తమ నృత్య దర్శకురాలు: బృందా (తనిఒరువన్‌)


ఇవి కూడా చదవండి:

====================

*RC16: అఫీషియల్.. రామ్ చరణ్ సినిమాలో జాన్వీకపూర్

**************************

*Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..

****************************

*Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

***************************

Updated Date - Mar 06 , 2024 | 10:38 AM